గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్స్‌ను అందజేయాల్సి వచ్చేది. ఇప్పుడు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలతో పాటు వివిధ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా పింఛన్ దారులు ఆన్ లైన్ లో తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను అందజేయవచ్చు. సీనియర్ సిటిజన్లు, మొబిలిటీ చాలెంజ్ వ్యక్తులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా తమ ఇళ్ల నుంచే లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. మీరు కోరిన వెంటనే బ్యాంకు ప్రతినిధులు లేదా సర్వీస్ ప్రొవైడర్లు ఇంటికి వస్తారు. మీ వివరాలను, పత్రాలను ఆన్ లైన్ లో సబ్మిట్ చేస్తారు. దీని వల్ల ఇంటి నుంచి బయటకు రాకుండానే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వీలు కలుగుతుంది.
సీనియర్ సిటిజన్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి బ్యాంకులకు, పోస్టాఫీసుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ వయసులో బయటకు రావాలంటే చాలా కష్టం. దీంతో ఇలాంటి వారికి ఉపయోగపడేలా డోర్ స్టెప్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల పింఛన్ దారులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ తో పాటు ప్రధాన బ్యాంకులన్నీ ఈ సేవలను అందజేస్తున్నాయి. అయితే దీని కోసం కొంత చార్జీ వసూలు చేస్తారు.
ఇవి కూడా చదవండి
డోర్ స్టెప్ సర్వీసులను పొందడం ఇలా
- డోర్ స్టెప్ బ్యాంకింక్ సేవ కావాలనుకునే పింఛన్ దారులు తమ బ్యాంక్ వెబ్ సైట్, మొబైల్ యాప్, డోర్ స్టేప్ బ్యాంకింగ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలి.
- కొన్ని బ్యాంకులు అలయన్స్ యాప్ లేదా సమీపంలోని శాఖను సంప్రదించడం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇస్తాయి.
- ఆధార్ నంబర్, పింఛన్ ఖాతా, ఇతర ధ్రువీకరణ కోసం పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
- బ్యాంక్ ఏజెంట్ మీ ఇంటికి రావాల్సిన తేదీ, సమయం, చిరునామాను అందజేయాలి.
- బ్యాంక్ ఏజెంట్ మీ లైఫ్ సర్టిఫికెట్ ఫారం అందజేస్తారు. అలాగే జీవన్ ప్రమాణ్ యాప్, బయోమెట్రిక్ పరికరాన్ని ఉపయోగించి వివరాలు నమోదు చేస్తారు.
- అనంతరం మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్ సీ)ని ఎలక్ట్రానిక్ విధానంలో పెన్షన్ పంపిణీ అధికారికి సమర్పిస్తారు.
- లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఇండియా పోస్ట్ కూడా డోర్ స్టెప్ సేవలను అందిస్తోంది.
- యోమెట్రిక్ పరికరం, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ యాప్ ను ఉపయోగించి ఆన్ లైన్ లో సమర్పించవచ్చు.
- లైఫ్ సర్టిఫికెట్ అందజేయడానికి నవంబర్ 30వ తేదీ వరకూ మాత్రమే సమయం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి