జియో 5జీ సేవలు తీసుకొచ్చినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత 5జీ డేటాను అందించింది. రూ.239 కంటే ఎక్కువ రీచార్జి చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఏడాది జులైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత 5జీ డేటాకు పరిమితి నిర్దేశించింది సంస్థ. ఎవరైతే రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్‌ను రీచార్జి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే నెలకు రూ.349 ప్లాన్ రీచార్జి చేసే వారికే ఉచిత 5జీ డేటా అన్నమాట.
అయితే, తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికీ 5జీ సేవలు అందించేందుకు ఆ మధ్య సంస్థ రూ.51, రూ.101, 151తో బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఏడాది పొడవునా అపరిమిత 5జీ డేటాను అందించేందుకు రూ.601 వోచర్‌ను జియో తీసుకువచ్చింది. దీన్ని జియో యాప్‌లో కొనుగోలు చేసి యాప్‌లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కావాలంటే స్నేహితులకూ ఈ వోచర్‌ను గిఫ్ట్‌లా పంపుకోవచ్చని జియో చెబుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.