ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. గంటల తరబడి మరీ కంప్యూటర్స్ ముందు కూర్చొని పని చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మందికి యంగ్ ఏజ్‌లోనే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు తినే ఆహారాల్లో కూడా పోషకాలు ఉండటం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయట. కీళ్ల నొప్పుల కారణంగా ఏ పనీ సరిగా చేయలేం. శరీరం మాట వినదు. మరి ఆహారాలు ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ మీట్:
ఎరుపు మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వీటిల్లో ప్యూరిన్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి రెడ్ మీట్‌కి వీలైనంత వరకు దూరంగా ఉండండి.
సోయా ఫుడ్స్:
సోయా ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి మంచిదని సోయా ఎక్కువగా తీసుకన్నా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తినే ఆహారం ఏంటి.. మీ శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో గమనించుకోండి.
ఇవి కూడా చదవండి
చక్కెర పదార్థాలు:
పంచదార ఎక్కువగా ఉన్న ఆహారాలు తిన్నా కూడా కీళ్ల నొప్పులు అనేవి తీవ్రంగా ఎటాక్ చేస్తాయి. ఇది కాస్తా డయాబెటీస్‌కు కూడా దారి తీస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులతో ఉండే వారు పంచదార, స్వీట్ ఐటెమ్స్ తక్కువగా తినడం బెటర్.
పిండి పదార్థాలు:
అదే విధంగా పిండి పదార్థాలు తినడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బియ్యం, గోధుమల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గ్లూటెన్‌ను రిలీజ్ చేస్తాయి. కాబట్టి వీటి వలన కూడా కీళ్ల నొప్పులు రావచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.