శ్యామ్‌దాసాని కుటుంబం దాదాపు 50 ఏళ్ల క్రితం కాన్పూర్ వచ్చింది. నేడు ఈ కుటుంబం పార్లే-జి బిస్కెట్ ఫ్రాంచైజీతో పాటు ఇతర వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బిలియనీర్‌లలో ఒకరిగా ఉన్నారు. శ్యామ్‌దాసాని కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. సంజయ్ తన భార్య, కొడుకుతో పై అంతస్తులో ఉన్నారు. దీపావళి రోజున కొడుకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగా సంజయ్ నిద్రపోయాడు. అర్థరాత్రి దీపావళి దీపం నుండి మంటలు చెలరేగాయి. అది నేల మొత్తం వ్యాపించింది. దీపావళికి కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంట్లో కలపతో ఫాల్స్ సీలింగ్ చేయించాడు. దీంతో పాటు తలుపులు, కిటికీలను సౌండ్ ప్రూఫ్ చేసి సెన్సార్‌లతో వర్క్ అయ్యేలా ఎలక్ట్రానిక్‌గా మార్చాడు. అయితే ఇంట్లో దీపం కారణంగా అంటుకున్న మంటలు, ఇల్లంతా వ్యాపించి ఎలక్ట్రానిక్ వైర్లు తగలబడి సెన్సార్లు పనిచేయడం మానేసాయి. దాంతో తలుపులు, కిటికీలు జామ్ అయ్యాయి. కుటుంబ సభ్యులంతా ఊపిరాడక చనిపోయినట్లు నిపుణులు భావిస్తున్నారు.
ఉదయం నాలుగింటికి ఇంటికి చేరుకున్న శ్యామ్‌దాసాని కుమారుడు పొగలను గమనించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. సంజయ్ కుటుంబానికి ఒక పర్షియన్ పిల్లి ఉంది. అది ప్రమాదంలో మరణించింది. బహుశా పిల్లి దూకడం వల్ల ఇంట్లోని దేవుడి వద్ద ఉంచిన దీపం పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, ప్రమాదంలో చనిపోయిన పిల్లికి కూడా పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇంట్లో గాలి చొరబడాలని వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలని అగ్నిమాపక నిపుణులు సూచిస్తున్నారు. ఆధునికత ముసుగులో, ప్రజలు తమ ఇళ్లను పూర్తి ఏసీతో ప్యాక్ చేస్తున్నారనీ దీని కారణంగా వారి ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని అన్నారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందనీ హెచ్చరించారు. శ్యామదాసాని కుటుంబీకుల ఇంట్లో వెంటిలేషన్ ఉండి, తలుపులు ఎలక్ర్టానిక్‌గా లేకుంటే, బహుశా ఆ కుటుంబం ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉండేది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.