Karthika Amavsaya 2024: కార్తీక మాసం అమావాస్య రోజున ఈ ఒక్క పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు!

3 days ago 2

హిందూ మతంలో పౌర్ణమి, అమావాస్య తిధులు చాలా ప్రత్యేకంగా పరిగణించబడతాయి. అమావాస్య ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది. అమావాస్య రోజున గంగాస్నానం, శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పితృ దోషం తొలగిపోతుందని నమ్మకం.

హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ 1వ తేదీన వస్తుంది. మతపరమైన దృక్కోణంలో అమావాస్య చాలా ప్రత్యేకమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుంది.

కార్తీక అమావాస్య ఎప్పుడంటే

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిధి నవంబర్ 30, శనివారం ఉదయం 10:29 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ అమావాస్య తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది. క్యాలెండర్‌ను పరిశీలిస్తే ఈ సంవత్సరం కార్తీక అమావాస్య డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి

కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాన్ని చేస్తే.. మీ ఖజానా డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ పరిహారం లక్ష్మీ దేవికి సంబంధించిన నామాలను జపించడం. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి 108 నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం. ఈ అమావాస్య రోజున మీరు క్రింద ఇవ్వబడిన లక్ష్మీ దేవి 108 నామాలను జపించడం శుభప్రదం.. అమ్మవారి అనుగ్రహం మీ సొంతం..

లక్ష్మిదేవి అష్టోత్తర శతనామావళి (లక్ష్మి 108 పేర్లు)

1.ఓం ప్రకృత్యై నమః

2.ఓం వికృత్యై నమః

3.ఓం విద్యాయై నమః

4.ఓం సర్వభూతహితప్రదాయై నమః

5.ఓం శ్రద్ధాయై నమః

6.ఓం విభూత్యై నమః

7.ఓం సురభ్యై నమః

8.ఓం పరమాత్మికాయై నమః

9.ఓం వాచే నమః

10.ఓం పద్మాలయాయై నమః

11.ఓం పద్మాయై నమః

12.ఓం శుచయే నమః

13.ఓం స్వాహాయై నమః

14.ఓం స్వధాయై నమః

15.ఓం సుధాయై నమః

16.ఓం ధన్యాయై నమః

17.ఓం హిరణ్మయ్యై నమః

18.లక్ష్మ్యై నమః గురించి

19.ఓం నిత్యపుష్టాయై నమః

20.ఓం విభావర్యాయై నమః

21.ఓం ఆదిత్యై నమః

22.ఓం దిత్యై ది నమః

23.ఓం దీపాయై నమః

24.ఓం వసుధాయై నమః

25.ఓం వసుధారిణ్యై నమః

26.ఓం కమలాయై నమః

27.ఓం కాంతాయై నమః

28.ఓం కామాక్ష్యై నమః

29.ఓం క్రోధసంభవాయై నమః

30.ఓం అనుగ్రహప్రదాయై నమః

31.ఓం బుద్ద్యై నమః

32.ఓం అనఘాయై నమః

33.ఓం హరివల్లభాయై నమః

34.ఓం అశోకాయై నమః

35.ఓం అమృతాయై నమః

36.ఓం దీప్తాయై నమః

37.ఓం లోకాశోకవినాశిన్యై నమః

38.ఓం ధర్మనిలయాయై నమః

39.ఓం కరుణాయై నమః

40.ఓం లోకమాత్రే నమః

41.ఓం పద్మప్రియాయై నమః

42.ఓం పద్మహస్తాయై నమః

43.ఓం పద్మాక్ష్యై నమః

44.ఓం పద్మ సుందర్యై నమః

45.ఓం పద్మోద్భవాయై నమః

46.ఓం పద్మముఖ్యై నమః

47.ఓం పద్మనాభప్రియాయై నమః

48.ఓం రామాయై నమః

49.ఓం పద్మమాలాధారాయై నమః

50.ఓం దేవ్యై నమః

51. ఓం పద్మిన్యై నమః

52.ఓం పద్మగంధిన్యై నమః

53.ఓం పుణ్యగంధాయై నమః

54.ఓం సుప్రసన్నాయై నమః

55.ఓం ప్రసాదాభిముఖ్యై నమః

56. ఓం ప్రభాయై నమః

57.ఓం చంద్రవదనాయై నమః

58. ఓం చంద్రాయై నమః

59.ఓం చంద్రసహోదర్యై నమః

60.ఓం చతుర్భుజాయై నమః

61.ఓం చంద్రరూపాయై నమః

62.ఓం ఇందిరాయై నమః

63.ఓం ఇన్దుశీతలాయై నమః

64.ఓం ఆహ్లాదజనన్యై నమః

65.ఓం పుష్టాయై నమః

66.ఓం శివాయై నమః

67.ఓం శివకార్య నమః

68.ఓం సత్యై నమః

69.ఓం విమలాయై నమః

70.ఓం విశ్వజనన్యై నమః

71.ఓం తుష్ఠాయై నమః

72.ఓం దారిద్ర్యనాశిన్యై నమః

73.ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

74.ఓం శాన్తాయై నమః

75.ఓం శుక్లమాల్యామ్బరాయై నమః

76.ఓం శ్రియై నమః

77.ఓం భాస్కర్యై నమః

78.ఓం బిల్వనిలయాయై నమః

79.ఓం వరారోహాయై నమః

80.ఓం యశస్విన్యై నమః

81.ఓం వసుంధరాయ నమః

82.ఓం ఉదారాంగాయై నమః

83.ఓం హరిణ్యై నమః

84.ఓం హేమమాలిన్యై నమః

85.ఓం ధనధాన్యకార్యే నమః

86.ఓం సిద్ధయే నమః

87.ఓం స్త్రీసౌమ్యాయై నమః

88.ఓం శుభప్రదాయే నమః

89.ఓం నృపవేశ్యగతానందాయై నమః

90.ఓం వరలక్ష్మ్యై నమః

91.ఓం వసుప్రదాయై నమః

92.ఓం శుభాయై నమః

93.ఓం హిరణ్యప్రకారాయై నమః

94.ఓం సముద్రతనాయై నమః

95.ఓం జయాయై నమః

96.ఓం మంగళా దేవ్యై నమః

97.ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః

98.ఓం విష్ణుపత్న్యై నమః

99.ఓం ప్రసన్నాక్ష్యై నమః

100.ఓం నారాయణసమాశ్రితాయై నమః

101.ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః

102. ఓం దేవ్యై నమః

103.ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః

104.ఓం నవదుర్గాయై నమః

105. ఓం మహాకాళ్యై నమః

106.ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

107. ఓం మంగళదేవ్యై నమః

108. ఓం భువనేశ్వరాయై నమః

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article