keerthy suresh: రివాల్వర్ రీటాగా కీర్తిసురేష్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!

2 hours ago 1

2000బాల నటిగా కెరీర్ ప్రారంభించింది అందాల ముద్దుగుమ్మ కీర్తిసురేష్. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు. ఈ ముద్దుగుమ్మ 2013లో ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం గీతాంజలితో నటిగా రంగప్రవేశం చేసింది. కీర్తి కాలేజీ ఫ్యాషన్ డిజైన్ చదివింది. ఫ్యాషన్ డిజైన్ పై తనకున్న మక్కువపై దృష్టి సారించి పలు దుస్తులను డిజైన్ చేసింది. ఆ తర్వాత 2015లో తమిళ చిత్ర దర్శకుడు ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన “ఇతు ఎన్న మాయం” చిత్రంలో నటుడు విక్రమ్ ప్రభు సరసన తమిళంలో నటిగా ఆమె రంగప్రవేశం చేసింది. ఈ సినిమా కోసం 2015లో తమిళ డెబ్యూ నటి అవార్డును గెలుచుకుంది. ఆతర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

ఆతర్వాత వచ్చిన మహానటి సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమా తర్వాత కీర్తిసురేష్ కు అవకాశాలు వెట్టుకుంటూ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తుంది కీర్తిసురేష్. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది ఈ బ్యూటీ.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీఓరియెంటడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి నటిస్తున్న కొత్త సినిమా టీజర్ ను విడుదల చేశారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రివాల్వర్ రీటా’. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ నటిస్తున్నారు. దర్శకుడు JK చండూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియో నిర్మించింది.  కీర్తి సురేష్ ఈ సినిమాలో పోలీస్ పాత్రను పోషిస్తోంది.ఇక టీజర్‌లో ఆమె తన బ్యాగ్ నుండి తుపాకీని  తీసి కాల్చే దృశ్యాలను చూపించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ టైటిల్ టీజర్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article