ఖుస్కా పులావ్ అంటే సిటీ వాళ్లకు బాగా తెలిసే ఉంటుంది. సాధారణంగా చేసే బిర్యానీ, పులావ్‌లు వేరు. ఖుస్కా పులావ్ వేరుగా చేస్తారు. ఇంచుమించుకు ఒకేలా ఉన్నా.. రుచి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఖుస్కా తిన్నవాళ్లకు.. ఈ పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా ఈజీగా ఈ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇతర కర్రీలతో కంటే.. ప్లెయిన్‌గా తినడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదన్నా రుచిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఖుస్కా ట్రై చేయండి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మరి ఈ ఖుస్కా పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఖుస్కా పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:
బాస్మతీ రైస్, నెయ్యి, నూనె, బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, సోంపు గింజలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు.
ఖుస్కా పులావ్ తయారీ విధానం:
బాస్మతీ రైస్‌ని ముందుగా అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకుని.. అందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత సోంపు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
ఇవి కూడా చదవండి
ఇది పచ్చి వాసన పోయాక పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి మళ్లీ ఓ రెండు నిమిషాలు వేయించాలి. మసాలాలు కూడా వేగాక.. టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు, కొత్తిమీర తరుగు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఖుస్కా బిర్యానీ సిద్ధం. ఈ రైస్ ప్లెయిన్‌గా తినేయవచ్చు.