Kidney Stone: మాటిమాటికీ పొత్తి కడుపులో నొప్పి, జ్వరం వస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు షెడ్‌కు చేరినట్లే..

2 hours ago 1

జీవన శైలి వ్యాధుల్లో కిడ్నీ సమస్యలు ఒకటి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి నేటి జీవన శైలియే ప్రధాన కారణం. అయితే ఈ సమస్య లక్షణాలు తొలినాళ్లలో బయటపడవు. అందుకే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వీటిల్లో ఏవైనా మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. అవేంటంటే..

|

Updated on: Oct 25, 2024 | 8:32 PM

నీరు జీవితానికి మూలాధారం. నీళ్లు తాగకపోతే శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. డీహైడ్రేషన్, చర్మ సమస్యలతోపాటు ఇతర శారీరక సమస్యలు కనిపిస్తాయి. నీళ్లు తాగకపోతే వచ్చే సమస్యల్లో కిడ్నీ సమస్యలు ఒకటి. తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పొత్తికడుపు లేదా నడుము భాగంలో భరించలేని నొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఆధునిక జీవనశైలి, నియంత్రణ లేని ఆహారం మొదలైనవి కిడ్నీలో రాళ్లకు కొన్ని కారణాలు. మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలంటే?

1 / 5

సాధారణంగా ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు నిర్ధారణ అవుతుంది. అదేవిధంగా కిడ్నీలో రాళ్లు ఉన్నా కూడా కొన్ని లక్షణాలను చూస్తే అర్థమవుతుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణం కడుపు లేదా వెన్నునొప్పి. ముఖ్యంగా నొప్పి కింది పొత్తికడుపు నుంచి వెనుకకు కదులుతున్నట్లయితే, అది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు.

2 / 5

ఈ వ్యాధి కారణంగా చాలా మందికి తరచుగా జ్వరం వస్తుంది. మళ్లీ మళ్లీ జ్వరం వస్తుంటే మాత్రం జాగ్రత్త. అలాగే మూత్రం రంగుపై కూడా శ్రద్ద పెట్టాలి. దీని ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. మూత్రం ఎరుపు రంగులో ఉంటే, వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. ఇతర మూత్రపిండ సమస్యలు కూడా ఎరుపు మూత్రానికి కారణమవుతాయి.

3 / 5

ముఖ్యంగా పొత్తికడుపు నుంచి వెనుక వరకు నొప్పి.. కూర్చోవడం లేదా పడుకోవడం కూడా కష్టమయ్యే స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి, ఈ లక్షణం ఉంటే మూత్రపిండ రాళ్లు, మరేదైనా మూత్రపిండాల సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇందుకు నిర్దిష్ట పరీక్షలు కూడా చేసుకోవాలి. అయితే కొన్ని నియమాలు పాటిస్తే కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేసుకోవచ్చు. వాటిలో మొదటిది తాగునీరు. అయితే నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యకరమైన సంకేతం కాదు. శరీర అవసరాలకు అనుగుణంగా నీటిని తీసుకోవాలి. ఇది కిడ్నీలకు మేలు చేస్తుంది. ఒక వయోజన వ్యక్తి రోజుకు 3-4 లీటర్ల నీరు త్రాగాలి.

4 / 5

డైట్ మంచిదే కానీ కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అదనపు కాల్షియం రిచ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. పాలు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సాధారణ నియమాలన్నింటినీ పాటిస్తే, కిడ్నీలో రాళ్ల భయం చాలా వరకు తగ్గుతుంది. అయితే, ఈ వ్యాధి శరీరంలో పాతుకుపోయినప్పటికీ, ఇది తరచుగా మొదటి దశలో అర్థం కాదు. అందుకే మూత్రపిండాల సమస్యల లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article