Valentine's Astrology 2025: ప్రేమికుల దినోత్సవం కేవలం ప్రేమికులకే కాక దంపతులకు కూడా వర్తిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం మేరకు పెళ్లిళ్లకు, ప్రేమలకు కారకుడైన శుక్రుడు ప్రధానంగా స్త్రీ గ్రహం. ఈ శుక్రుడు మరో 20 రోజుల పాటు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుతో పరివర్తన చెందడం, రాహువుతో కలిసి ఉండడం వంట కారణాల వల్ల ఈ నెలాఖరు వరకు ఇంటా బయటా గృహ లక్ష్మి మాటకు, చేతకు విలువ పెరగబోతోంది. సతీమణి కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందబోతున్నాయి.
Love Astrology 2025
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Feb 11, 2025 | 7:26 PM
ప్రేమికుల దినోత్సవం కేవలం ప్రేమికులకే కాక దంపతులకు కూడా వర్తిస్తుంది. పెళ్లిళ్లకు, ప్రేమలకు కారకుడైన శుక్రుడు ప్రధానంగా స్త్రీ గ్రహం. ఈ శుక్రుడు మరో 20 రోజుల పాటు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుతో పరివర్తన చెందడం, రాహువుతో కలిసి ఉండడం వంట కారణాల వల్ల ఈ నెలాఖరు వరకు ఇంటా బయటా గృహ లక్ష్మి మాటకు, చేతకు విలువ పెరగబోతోంది. సతీమణి కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందబోతున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆమె చక్రం తిప్పబోతున్నారు. సర్వత్రా ఆమె మాటే చెలామణీ కాబోతోంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు చెందిన సతీమణుల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండడం, ఎటువంటి దాంపత్య, వైవాహిక సమస్యలైనా పరిష్కారం కావడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజి కంగా, కుటుంబపరంగా కూడా సతీమణికి ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆమె తన సమర్థతను నిరూపించుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లలో ఆమె పెట్టే పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి. దాంపత్య, కుటుంబ సమస్యలేమైనా ఉంటే తప్పకుండా పరిష్కారమవుతాయి. కొన్ని కుటుంబ బాధ్యతలను సతీమణికి వదిలేయడం మంచిది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలలో సతీమణి ఒక వెలుగు వెలుగుతారు. ఉన్నత పదవులు అందుకుంటారు. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు పొందు తారు. రాజకీయాల్లో ఉన్నవారు అధికార యోగం అనుభవిస్తారు. నిరుద్యోగులకు అనేక అరుదైన ఆఫర్లు అందుతాయి. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. బంధుమిత్రుల్లో వీరి మాటకు విలువ పెరుగుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. తల్లి తండ్రుల నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మహిళా ఉద్యోగులు, నిరుద్యో గులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు, వివాదా లన్నీ పరిష్కారమై, అన్యోన్యత బాగా వృద్ధి చెందుతుంది. భర్తకు ఇంటా బయటా ప్రాధాన్యం పెరు గుతుంది. కలలో కూడా ఊహించని ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. సతీమణి సలహాలు, సూచనల వల్ల భర్తకు, పిల్లలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలన్నీ చక్కబడ తాయి. సతీమణిలో కార్యదక్షత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు లభిస్తాయి.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థంలో, అంటే గృహ, సుఖ సంతోషాల స్థానంలో ఉచ్ఛ శుక్ర సంచారం వల్ల సతీమణి పేరు మీద చేపట్టే ఏ కార్యక్రమమైనా, ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. బంధువుల వివాదా లను పరిష్కరిస్తారు. ఆస్తి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. సతీమణి వల్ల కొన్ని అదృష్ట యోగాలు కలుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- కుంభం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారి సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మంచి హోదా లభించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆమె సలహాలు, సూచనల వల్ల అధికారులు మాత్రమే కాక, బంధుమిత్రులు కూడా లబ్ధి పొందుతారు. సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి