కర్ణాటక ఫేమస్ వంటల్లో మద్దూరు వడలు కూడా ఒకటి. మద్దూరు వడలు ఎంతో రుచిగా ఉంటాయి. కర్ణాటకలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. సాధారణంగా దీపావళికి పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ స్వీట్లేనా బోర్ కొట్టేవాళ్లు ఇలా వెరైటీగా మద్దూర్ వడలు ట్రై చేయండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని బియ్యం పిండితో తయారు చేస్తూ ఉంటారు. కర్ణాటక స్టైల్ వంటకం మీరు రుచి చూడాలంటే ఒకసారి వీటిని ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతాయి. అంతే కాకుండా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మరి ఈ మద్దూరు వడలను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మద్దూరు వడలకు కావాల్సిన పదార్థాలు:
బియ్యం పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, ఆయిల్.
మద్దూరు వడలు తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ వేసి కలపండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఉప్పు కొద్దిగా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓ అరగంట సేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఓ పాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని వడల్లా ఒత్తుకోవాలి.
ఇవి కూడా చదవండి
వీటిని ఆయిల్‌లో వేసి రెండు వైపులా ఎర్రగా వేయించాలి. బంగారు రంగులోకి వచ్చాక.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే మద్దరు వడలు సిద్ధం. వీటిని అప్పటికప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. కావాలి అనుకునేవారు పల్లీ చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీతో కూడా తినవచ్చు.