ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద కొన్నిరోజులుగా మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు రోజూ కోట్లాది మంది ప్రజలు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. తాజాగా కుంభమేళాలో ఓ హీరోయిన్ సన్యాసం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Mamta Kulkarni
ఒకప్పుడు ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. 90లలో ఆమె బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారును వెర్రెక్కించేసింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె ఒక్కసారిగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ హీరోయిన్ మమతా కులకర్ణి. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మమతా కులకర్ణి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక ఈరోజు ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ప్రస్తుతం మమతా కులకర్ణికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో మమతా కులకర్ణి సాధ్విగా కనిపిస్తుంది.
మమతా కులకర్ణి మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్నారు. జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీయామై మమత నందగిరిగా మార్చుకుంది. మమతా కులకర్ణి కాషాయ దుస్తులు ధరించి మెడలో రుద్రాక్ష మాల, భుజానికి వేలాడుతున్న జోలె కనిపిస్తుంది. ఇప్పుడు మమత కులకర్ణి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు. మమతా కులకర్ణి స్వయంగా కొన్ని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మమతా కులకర్ణి సాధ్విగా కనిపిస్తుంది.
జనవరి 29న మౌని అమావాస్య రోజున రాజస్నానం చేసి విశ్వనాథ ఆలయానికి వెళ్తానని.. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి అక్కడ విరాళం ఇస్తానని మమతా కులకర్ణి తెలియజేశారు. మమతా కులకర్ణి సాధ్విగా మారిన తర్వాత చాలా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పోస్ట్‌పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..