Maharashtra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దూసుకుపోతున్న ఎన్డీఏ.. గట్టి పోటీ ఇస్తున్న ఇండియా కూటమి..

3 days ago 1

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి, తిరిగి ప్రభుత్వంలోకి రావాలని ప్రయత్నిస్తున్న మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మధ్య జరుగుతున్న తీవ్ర పోటీపైనే అందరీ దృష్టి ఉంది. ఈసారి మహారాష్ట్రలో మొత్తం 66.05 శాతం ఓటింగ్ నమోదైంది, ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ నుంచి 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. NDA మిత్రపక్షం శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

ప్రతిపక్ష MVA కూటమిలో, కాంగ్రెస్ గరిష్టంగా 101 స్థానాల్లో తన అభ్యర్థులను పోటిలో దింపింది. కాగా, శివసేన (ఉభత) 95 మంది అభ్యర్థులను, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) 86 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) 237 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM)కి చెందిన 17 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపునకు మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది.

మహారాష్ట్రలో ఎవరు లీడ్‌లో ఉన్నారు?

మహారాష్ట్రలో NDA 164 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏకనాథ్ షిండే 4231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అజిత్ పవార్ 3623 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

జార్ఖండ్‌: 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నవంబర్ 13 మరియు 20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగిన రాష్ట్రంలో అధికార మహాఘటబంధన్, ప్రతిపక్ష NDA మధ్య భీకర పోరు కొనసాగుతుంది. JMM, కాంగ్రెస్, RJDలతో కూడిన మహాఘట్‌బంధన్ వరుసగా రెండవసారి పదవిని దక్కించుకోవాలని తహతహలాడుతుంది. అలాగే బీజేపీ దాని మిత్రపక్షం AJSU ఐదేళ్ల ప్రతిపక్షంలో ఉన్న తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడుతుంది.

జార్ఖండ్‌లో ఎవరు లీడ్‌లో ఉన్నారు?

జార్ఖండ్‌లో బీజేపీ కూటమి మెజారిటీకి చేరువైంది. ఎన్డీయే 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కాంగ్రెస్-జేఎంఎం 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జార్ఖండ్‌లో మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 41.. బర్హెత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. హజారీబాగ్ సదర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రదీప్ ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. చంపై సోరెన్ సెరైకెలా నుంచి ముందంజలో ఉన్నారు. వర్లీ నియోజకవర్గం మొదటి రౌండ్ కౌంటింగ్లో ఆదిత్య ఠాక్రే 495 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article