మహారాష్ట్రాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మరికొందరు లోపల చిక్కుకపోయినట్లు తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆంబులెన్స్‌లో ఘటనా స్థలికి చేరుకున్నాయి.
Breaking
మహారాష్ట్ర బండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 8 మంది దుర్మరణం చెందగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్‌లో ఈ పేలుడు ఘటనతో పై కప్పు కూలిపోయింది. దీంతో 12 మంది లోపల చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని కాపాడగా.. మిగిలిన 10 మంది కోసం రిస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పేలుడుకు కారణాలు తెలియడం లేదు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.