పుష్ప-2 సినిమాతో మన్యంలోని చాలా పర్యాటక ప్రాంతాలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. పుష్ప-2 మూవీలోని యాక్షన్ పార్ట్‌తోపాటు కీలక సన్నివేశాలు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లోనే చిత్రీకరించారు. మూవీలోని ఛేజింగ్ సీన్స్ కూడా ఈ ప్రాంతంలోనే షూట్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సినిమా కోసం తయారు చేసిన ఎర్రచందనం దుంగలు, ఇతర మెటిరియల్స్ ఆ ప్రాంతంలో చాలా చోట్ల కనిపిస్తాయి. ఇక్కడ షూట్ చేసిన సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు స్థానికులు.
రంపచోడవరంకు 10 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు పుష్ప స్పాట్ అనే బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సినిమాలో పోలీసులు, హీరోకు సంబంధించిన సన్నివేశాలు ఇక్కడే షూట్ చేయడంతో ఈ ప్రాంతాలకు పుష్ప స్పాట్ అని పేరు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మారింది. సినిమాలోని ఫైట్ సీన్స్, సునీల్ చేసిన మంగళంసీను పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఈ అడవి మధ్యలో షూట్ చేసినట్లు స్థానికులు, పర్యాటకులు చెబుతున్నారు.
భీమవరం ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు కొట్టడానికి కూలీలలను తీసుకెళ్లే సీన్స్ షూట్ చేశారు. దీంతో వాడపల్లి గ్రామం పేరు మార్మోగుతోంది. వాడపల్లి గ్రామస్తులు కూడా కొన్ని సన్నివేశాల్లో నటించారు.
ఏది ఏమైనా పర్యాటకానికి మరింత ఆయూవు పోసిన పుష్పతో పాటు, తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప 2 కీలకమైన సీన్లను మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడంతో రంపచోడవరం నియోజకవర్గం టాక్ ఆఫ్ టూ స్టేట్స్‌గా మారింది. తమ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చిన మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు స్థానికులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.