దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట్ మర్డర్ కేసులో రోజులో సంచలనం బయటపడుతుంది. అయితే గురుమూర్తి చేసిన హత్య మొదట క్షణికావేశమని పోలీసులు అనుమానించారు. ఈనెల 14వ తారీఖున సంక్రాంతి పండుగ రోజు పిల్లలతో కలిసి గురుమూర్తి దంపతులు సినిమాకు వెళ్లారు. హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూసేందుకు సెకండ్ షోకు టికెట్లు బుక్ చేసుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత వారి పిల్లలను బంధువుల ఇళ్లలో దింపేసి గురుమూర్తితో పాటు ఆయన భార్య మాధవి మాత్రమే జిల్లెలగూడలో ఉన్న వీరి ఇంటికి తిరిగివచ్చారు. వీరు ఇంటికి వచ్చేసరికి సుమారు ఒంటిగంట అయింది. ఇద్దరూ కూడా ఆరోజు రాత్రి పడుకున్నారు. ఇక తరువాత రోజు 15వ తారీఖున ఒకరోజు అయినా సరే పండగకు తన పుట్టింటికి పంపించాలని మాధవి గురుమూర్తిని అడిగింది. ఇందుకు గురుమూర్తి ఒప్పుకోలేదు. దీంతో ఆవేశంలో మాధవి గురుమూర్తితో గొడవ పడింది.
ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఇదే తరుణంలో మాధవిపై గురుమూర్తి చేయి చేసుకున్నాడు. గురుమూర్తి కొట్టడంతో మాధవి ఒకసారిగా కింద పడిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో మాధవి స్పాట్లోనే చనిపోయింది. మాధవి చనిపోవడంతో కంగుతిన్న గురుమూర్తి మృతదేహాన్ని ఏం చేయాలని ఆలోచించాడు. ఎలాగైనా సరే మృతదేహాన్ని మాయం చేస్తే తాను చేసిన తతంగం బయటికి రాదని భావించాడు. వెంటనే మాధవి మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. బాడీ పార్ట్స్ మొత్తాన్ని కెమికల్స్ ఉపయోగించి కరిగిపోయేలా చేశాడు. వాటిని బాత్రూం లోనే ప్లెష్ చేశాడు.
ఇక ఎవరికి అనుమానం రాకుండా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి కనిపించడం లేదని చెప్పాడు.. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. గురుమూర్తి ఇంట్లో సీసీ కెమెరాలు దాదాపు 8 ఉన్నాయి. 8 సీసీ కెమెరాలు గురుమూర్తి బకెట్ తీసుకెళుతున్న దృశ్యాలు మాత్రమే పోలీసులకు లభించాయి. ఇంట్లో నుండి మాధవి బయటకు వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు లభించలేదు. దీంతో గురుమూర్తి పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఈనెల 20న ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో జరిగిన విషయం మొత్తాన్ని అంగీకరించాడు.
ఇక మిస్సింగ్ కేసులో మర్డర్ కేసులో ప్రూవ్ చేసేందుకు పోలీసులు అనేక రకాల ఆధారాలను సేకరించాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదట గురుమూర్తి ఇంట్లో స్థానిక పోలీసులతో పాటు ఫోరెన్సిక్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. గురుమూర్తి మాధవిని హత్య చేసిన ప్లేస్‌తో పాటు బాత్రూంలో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన స్థలాన్ని పరిశీలించారు. వారికి లభించిన ఆధారాల ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దొరికిన ఆధారాలలో కీలకమైనది మాధవి హెయిర్ శాంపిల్. హెయిర్ శాంపిల్ ను మాధవి పిల్లల శాంపుల్‌తో జతపరిచి డిఎన్ఏ పరీక్షకు పంపించారు. డిఎన్ఏ రిపోర్ట్ పోలీసులకు చేరాక మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా పోలీసులు మార్చనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..