చాలా ఇళ్లలో ఇది కామన్ గా చూసే దృశ్యం. ఫోన్ చార్జింగ్ కేబుల్ కు ప్లాస్టర్లు చుట్టి.. రకరకాలుగా రిపేర్లు చేసి వాడుతూ ఉంటారు. చార్జర్ విషయానికొచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిషన్ గా మారిపోతుంటారు. కానీ ఇది తప్పు. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్లు పేలడం వల్ల జరిగిన ప్రమాదాల కంటే ఇలా తాత్కాలికంగా రిపేర్లు చేసి వాడుతున్న ఛార్జర్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎక్కువ. దానికి తోడు నాసిరకం, చైనా ఛార్జర్లతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ లోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ దీనిపై అధ్యయనం చేసింది. గత ఐదేళ్లుగా ప్రమాదాలకు గురవుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై వివిధ దేశాల్లో స్టడీ చేశారు. ఇందులో ఈ షాకింగ్ విషయం బయట పడింది. లక్షలు పెట్టి సెల్ ఫోన్ కొంటారు కానీ ఒకటి రెండు వేల వచ్చే ఛార్జర్ విషయంలో చాలామంది కక్కుర్తి పడతారు.
మరోవైపు మొబైల్ కంపెనీలు కూడా ఫోన్‌తో పాటు ఛార్జర్లను ఇవ్వడం నిలిపివేశాయి. దీంతో ఇళ్లలో ఉండే పాత ఛార్జర్ లోనే ప్లాస్టర్లు వేసి, రబ్బర్లు చుట్టి, వాటినే మళ్లీ మళ్లీ రిపేరు చేస్తూ వాడుతున్నారు. దీని ద్వారా జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇలాంటి ఛార్జర్లు వాడడం ద్వారా మనకు కరెంటు షాక్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ. వచ్చేది చిన్నపాటి షాక్ అయినా పెద్దవాళ్లు తట్టుకోగలరు అదే చిన్నపిల్లలైతే అది వాళ్లకి ప్రాణాంతకం.
ప్లాస్టర్లు చుట్టిన ఛార్జింగ్ కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ అయి పెద్దపెద్ద అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇక మీ మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్లీ ది అయిన ఈ చీప్ ఛార్జర్ దాన్ని మడత పెట్టేస్తుంది. పవర్ సప్లై సరిగ్గా అవ్వక మీ ఫోన్ తొందరలోనే బ్యాటరీ దెబ్బతింటుంది. ఇక దీంతోపాటు ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రిపేర్ ఛార్జర్ల వల్లనే ఫోన్లు పేలిపోవడం ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఛార్జర్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
- ఇంట్లో కేవలం సెల్ ఫోన్ కోసమే కాకుండా.. టాబ్, లాప్టాప్, ట్రిమ్మర్స్ ఇంకా చాలా రకాల గాడ్జెట్స్ కి ఇప్పుడు సి టైప్ పిన్ వస్తుంది. అందుకే కేబుల్స్ పాడైన పాత చార్జర్లను వదిలించుకొని మంచి బ్రాండెడ్ డ్యూయల్ కోర్టు ఉన్న ఛార్జర్లను కొనండి.
- చార్జర్ కొనేటప్పుడు అది బరువు లేకుండా తేలికగా కనిపిస్తే అది ఖచ్చితంగా మంచిది కాదు. మంచి ఛార్జర్లు కాస్త బరువుగానే ఉంటాయి.
- మీ ఛార్జింగ్ కేబుల్ ఎక్కడైనా కట్ అయితే ఆ లోపలి బాగా మెరుస్తూ కనిపిస్తే వెంటనే దాన్ని వాడడం ఆపేయండి.
- ఛార్జర్ కొనేటప్పుడు అడాప్టర్ పైన పవర్ ఇన్పుట్ అవుట్ పుట్ సప్లై పరిశీలించండి. అది మీ ఫోన్ కి వాడే ఇతర గాడ్జెట్స్ కి సూట్ అవుతుందా లేదా చూసుకోండి.
- అసలు మీ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పాడవకుండా ఉండాలంటే దాన్ని చుట్టే విధానం కరెక్ట్ గా ఉండాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి