కొన్ని రోజులుగా మహా కుంభమేళా 2025 ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద గల త్రివేణి సంగమం వద్ద ఈ మహాకుంభమేళా జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది అఘోరాలు, సాధువులు, జనాలు, సినీతారలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ఈ కుంభమేళాలో పూసలు అమ్ముకోవడానికి వచ్చి అనుహ్యంగా ఫేమస్ అయ్యింది ఓ అమ్మాయి. తన పేరే మోనాలిసా. అందమైన తేనె కళ్లు, చక్కని చిరునవ్వు.. కాటుక కళ్లతో ఒక్కసారిగా నెట్టింట సంచలనంగా మారింది. ఆమె అందానికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ అయ్యింది. పూసలు అమ్ముకోవడానికి సైతం వీలు లేకుండా ఆమె వెంటపడి మరీ వీడియోస్, ఫోటోస్ చిత్రీకరించారు. దీంతో మహాకుంభమేళాలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగడంతో ఆమె తన సొంతూరుకు వెళ్లిపోయింది.
తేనెకళ్లతో నెటిజన్లను కట్టిపడేసిన ఆ అమ్మాయికి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. తాను తెరకెక్కించే చిత్రంలో ఆమెకు ఓ పాత్రను ఇవ్వనున్నట్లు తెలిపారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసా కనిపించనుంది. ఇప్పటికే ఆమె స్వగ్రామానికి వెళ్లి.. ఆమె కుటుంబసభ్యులను సంప్రదించారు. ఇక సినిమాకు ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ కావడానికి మరో నెలరోజుల సమయం ఉన్నట్లు టాక్. అలాగే మోనాలిసాకు నటనలో శిక్షణ సైతం ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం మోనాలిసాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మోనాలిసా తొలి సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చర్చ నడుస్తుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాకుగానూ ఆమెకు రూ.21 లక్షలు పారితోషికం ఇస్తున్నారట. దీనిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన