నవంబర్ నెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య మరోసారి పరివర్తన చోటు చేసుకుంటుంది. ఈ రెండు మిత్ర గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల కొన్ని రాశులకు ధనపరంగా శుభ యోగాలు కలగడానికి, అదృష్టం పట్టడానికి అవ కాశం ఉంటుంది.
Telugu Astrology
ఈ నెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య మరోసారి పరివర్తన చోటు చేసుకుంటుంది. ఈ రెండు మిత్ర గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల కొన్ని రాశులకు ధనపరంగా శుభ యోగాలు కలగడానికి, అదృష్టం పట్టడానికి అవ కాశం ఉంటుంది. కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల సమయంలో ఎటువంటి ఆదాయ ప్రయత్నాలు చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి.
కర్కాటకం: రాశినాథుడు చంద్రుడితో కుజుడికి పరివర్తన జరిగినందువల్ల ఆదాయపరంగా ఎటువంటి ప్రయ త్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ధన యోగాలుపట్టడంతో పాటు, రావల సిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది. ఏ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా ఊహిం చని లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తప్పకుండా అంచనాలను మించుతాయి.
కన్య: ఈ రాశికి తృతీయ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల, కొద్ది ప్రయత్నంతో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ సంబంధమైన పురోగతి ఉంటుంది. షేర్లు, సెక్యూరిటీలు విశేషంగా లాభిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. ఆస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. రావాల్సిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది.
తుల: ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగపరంగా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ది చెందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు తప్పకుండా ఆశించిన లాభాలనిస్తాయి.
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి భాగ్య స్థానాధిపతితో పరివర్తన జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి అవకాశాలు అంది వస్తాయి. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో ఆదాయపరంగా ఊహించని పురోగతి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్ట మైన ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.
మకరం: ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు శ్రమకు మించిన ఫలితాలని స్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగు తుంది. పదోన్నతులకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు సమస్యల నుంచి బయటపడతాయి.
మీనం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కలలో కూడా ఊహించని అదృష్ట యోగాలు పడతాయి. మహా భాగ్య యోగం కలుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవు తాయి. షేర్లు, సెక్యూరిటీల ద్వారా లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.