Naga Chaitanya: అభిమానితో చైతన్య ముచ్చట్లు.. ఫిదా అవుతున్న నెటిజన్స్..

1 hour ago 1

సినీరంగంలో ఎంతోమంది స్టార్ హీరోస్ సింప్లిసిటీకి పెట్టింది పేరు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం.. భారీ హిట్స్ అందుకున్నప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా సామాన్యుల్లా ఉండిపోతారు. మరికొందరు మాత్రం తమ ప్రవర్తనతో విమర్శలపాలు అవుతుంటారు. తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి హీరోగా అడుగుపెట్టిన చైనత్య.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నాడు. తనదైన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా చైతన్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో చైతూ సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్న చైతన్యను కొందరు అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో నిరూపిస్తూ వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడాడు. ముఖ్యంగా ఓ ఫ్యాన్ తండేల్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయమని ఈ వీడియోలో అడుగుతున్నాడు. మరో ఫ్యాన్ మాత్రం సినిమా రిలీజ్ విషయం గురించి మాట్లాడుతూ కనిపించాడు. అటు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చైతూ.. అభిమానితో ఎంతో ఒపిగ్గా మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

అభిమానితో చైతూ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేస్తూ అక్కినేని హీరో సింప్లిసిటీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. తండేల్ సినిమాలో చైతన్య మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. మరోవైపు సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.

@chay_akkineni ఇంత ఫ్రీగా ఒక అభిమాని చెప్పింది వినే హీరో ఎవరైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ ….❤️ బాబు #WeWantThandelForSankranti pic.twitter.com/FDanD1JUja

— Thandel sivaji #2029 YSJSiddham (@ChaituSivaji) October 26, 2024

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article