స్టార్ హీరోయిన్ నయనతార ధనుష్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. తన వివాహ డాక్యుమెంటరీ విడుదలను నటుడు ధనుష్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నయనతార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ లేఖను పంచుకున్నారు. నయనతార స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.. తమిళం, తెలుగు, మలయాళం అలాగే హిందీలలో పాన్-ఇండియన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నయనతార 2003లో మలయాళ చిత్రం మనసినకరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. హరి దర్శకత్వంలో 2005లో వచ్చిన అయ్యా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించింది నయనతార. ఆ తర్వాత సూపర్ స్టార్ చంద్రముఖితో జోడీ కట్టి కోలీవుడ్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇక తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమాతో పరిచయం అయ్యారు
అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?
ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. మన దగ్గర దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ అలాగే కోలీవుడ్‌లోని రజనీ, అజిత్, విజయ్, సూర్య, ధనుష్ వంటి ప్రముఖ నటులకు నయనతార హీరోయిన్గా నటించింది. 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నయనతార మరియు విఘ్నేష్ శివన్ వివాహ వీడియోను నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు.
Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..
నయనతార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ధనుష్‌కి వ్యతిరేకంగా రాసిన లేఖ ఫిల్మ్ సర్కిల్స్‌లో కలకలం సృష్టించింది. తన వెడ్డింగ్ వీడియోలో నానుమ్ రౌడీ థాన్ సినిమాలోని 3 సెకన్ల షాట్‌ని ఉపయోగించినందుకు మీరు 10 కోట్లు డిమాండ్ చేశారని ఇందుకు గాను నోటీసులు పంపారు అని నయన్ పేర్కొన్నారు. కాగా నయనతార ధనుష్ వివాదంపై హీరోయిన్స్ ఒకొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్, ఐశ్వర్య లక్ష్మీ, దియా మీర్జా, ఏక్తా కపూర్ నయనతార ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ను లైక్ చేస్తూ తాము కూడా పరోక్షంగా ధనుష్ ని వ్యతిరేకస్తున్నామన్న విషయాన్ని తెలియజేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.