న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు గోల్డెన్ బాల్ సెషన్‌ను ప్రారంభించిన TV9 MD, CEO బరున్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. భారతదేశం జర్మనీ మధ్య సంబంధాల లోతును మరోసారి నొక్కిచెప్పిన ఆయన.. అభివృద్దిలో భాగస్వామ్యం మరువలేనిదని చెప్పారు. జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టేడియం MHP అరెనా వేదికగా టీవీ నైన్ నెట్‌వర్క్ న్యూస్-9 నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ అనేక ఆసక్తిదాయక అంశాలకు చర్చావేదికగా నిలిచింది.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు మాట్లాడిన బరున్ దాస్.. భారతదేశం, జర్మనీ మధ్య సంబంధాల ఔన్నత్యాన్ని మరోసారి నొక్కిచెప్పారు. భారత్, జర్మనీ కలిసి ప్రపంచ భవిష్యత్తుకు కొత్త రేఖను గీసుకోగలవని నేటి సెషన్ మరోసారి రుజువు చేసిందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు జర్మనీలోని బాడెన్-వుర్టెంబెర్గ్ రాష్ట్ర మంత్రి-అధ్యక్షుడు విన్‌ఫ్రైడ్ క్రెట్ష్‌మాన్‌తో పాటు ఫెడరల్ మంత్రి సెమ్ ఓజ్డెమిర్‌ను.. బరున్ దాస్ వేదికపైకి స్వాగతించారు.
భారత్, జర్మనీ కలిసి ప్రపంచ భవిష్యత్తుకు కొత్త రేఖను గీసుకోగలవని నేటి సెషన్ మరోసారి రుజువు చేసిందని ఆయన అన్నారు. బరున్ దాస్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు జర్మనీలోని బాడెన్-వుర్టెంబెర్గ్ మంత్రి-అధ్యక్షుడు విన్‌ఫ్రైడ్ క్రెట్ష్‌మాన్‌తో పాటు ఫెడరల్ మంత్రి సెమ్ ఓజ్డెమిర్‌ను స్వాగతించారు.ఈ సమ్మిట్‌లో జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా సెమ్ ఓజ్డెమిర్ ముఖ్యమైన అంశాలను లేవనెత్తారని బరున్ దాస్ అన్నారు. భారతదేశం, జర్మనీలు కలిసి ఆశాజనకమైన, స్థిరమైన భవిష్యత్తును ఎలా బలోపేతం చేయగలవో ఆయన తన ప్రసంగంలో వివరణాత్మకంగా వివరించారని చెప్పారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, యూరోపియన్ యూనియన్ మాజీ ఇంధన మంత్రి గుంథర్ ఒట్టింగర్ డిజిటల్ భవిష్యత్తుకు సంబంధించి చేసిన ప్రసంగం చాలా ముఖ్యమైనదిగా బరున్ దాస్ వెల్లడించారు. నేటి సెషన్‌లో వక్తలందరూ ముఖ్యమైన అంశాలపై చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారని అన్నారు. అతిథులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి నేటి చర్చలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సమయంలో, బరున్ దాస్ ఫోర్డ్ మోటార్స్ వ్యవస్థాపకుడుహెన్రీ ఫోర్డ్ ప్రకటనను పునరావృతం చేశారు.. ఆయన ప్రకటన తనకు ఎంతో ప్రీతికరమైనదని, ప్రపంచ అభివృద్ధితో పాటు మానవాళి రక్షణకు కూడా ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఫోర్డ్ మోటార్స్ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ తమతో కలిసి రావడం ఒక ప్రారంభం.. కలిసి ఉండటం పురోగతి… కలిసి పని చేయడం విజయం అంటూ ఆయన చేసిన ప్రకటన తనకు ఎంతో నచ్చిందని, ప్రపంచ అభివృద్ధితో పాటు మానవాళి రక్షణకు కూడా ఇది చాలా ముఖ్యమని బరున్ దాస్ అన్నారు. బరున్ దాస్ హెన్రీ ఫోర్డ్ ప్రకటనను మొదట జర్మన్లోకి, తరువాత ఆంగ్లంలోకి అనువదించారు. ఈ రోజు ఇంతమంది ఐక్యంగా నడిచేందుకు అందరూ ముందుకు రావడంతో ఎంతో ఆనందకరం అన్నారు.
బాడెన్-వుర్టెమ్‌బెర్గ్ ప్రాంతం వ్యవస్థాపకతలో ఆవిష్కరణలకు మాత్రమే కాకుండా బయటి వ్యక్తులను స్వాగతించే విధానానికి కూడా ప్రసిద్ధి చెందిందన్నారు బరున్ దాస్. బాడెన్-వుర్టెంబర్గ్ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో మంచి స్థానాన్ని సంపాదించుకుందని గుర్తు చేశారు. గతేడాది వస్తు, సేవల రంగంలో మంచి ఆదాయాన్ని అర్జించిందని చెప్పారు. బాడెన్-వుర్టెంబర్గ్‌లోని కష్టపడి పనిచేసే ప్రజలను బరున్ దాస్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1968లో.. తాను పుట్టని సమయంలో, భారతదేశం కేవలం 20 ఏళ్ల యువ దేశమని, అప్పటి నుంచి జర్మనీకి చెందిన బాడెన్-వుర్టెమ్‌బెర్గ్ భారతదేశంలోని మహారాష్ట్రతో ప్రత్యేక సంబంధాన్ని కొనసాగిస్తోందని అన్నారు. బాడెన్-వుర్టెంబెర్గ్ ముంబైతో సోదర నగర సంబంధాన్ని అభివృద్ధి చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారంతో దశాబ్దాలుగా పటిష్టమైన బంధం సాధ్యమైందని చెప్పారు.
ఉదాహరణగా, బరున్ దాస్ ఈ కాలంలో మహారాష్ట్ర – బాడెన్-వుర్టెంబర్గ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రస్తావించారు. నైపుణ్యం కలిగిన కార్మికుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఈ ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఈ ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. ఈ రోజు జరిగే కార్యక్రమం మన సంబంధాలలో మరింత విజయవంతమవుతుందని ఆశిస్తున్నామని బరున్ దాస్ తన ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని న్యూస్ 9 గ్లోబల్ సమిట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి