Nithya Menen: పెళ్ళికి వెళ్ళాయారా..! ఎట్టకేలకు బ్యాచ్‌లర్ లైఫ్‌కు నిత్యా బై బై.. వరుడు ఎవరంటే..!

2 hours ago 1

సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ నిత్యామీనన్. అందం అభినయం ఉన్న ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది అంతే కాదు నిత్యామీనన్ సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంది. సినిమాల్లో కొన్ని పాటలను కూడా ఆలపించింది ఈ అమ్మడు. నిత్యా తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!

నిత్యామీనన్ కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఇక తెలుగులో అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆతర్వాత నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. కాగా తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో మెరిసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ధనుష్ తో కలిసి ఆమె నటించిన తిరు సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా అవార్డు అందుకుంది. అయితే తాజాగా నిత్యామీనన్ పెళ్ళికి సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం తమిళ్ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. గతంలోనూ నిత్యామీనన్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి నిత్యం మీనన్ పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే నిత్యా పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారని అంటున్నారు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article