ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓ.జి.ఎల్) భారత దేశంలోనే అత్యంత ప్రముఖమైన ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతని జోడిస్తూ, పర్యావరణ సహిత ఆవిష్కరణలతో విద్యుత్ రవాణ (ఎలెక్ట్రిక్ మొబిలిటీ) రంగంలో తనదైన ముద్ర వేస్తూ దేశ ఉపరితల రవాణా రంగాన్ని విద్యుత్ తేజంతో ముందుకు నడిపిస్తున్నది.
దశాబ్ద కాలం తర్వాత భారత దేశ రాజధాని న్యూఢిల్లి లో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 లో ఒలెక్ట్రా నూతన ఆవిష్కరణలను ప్రదర్శించింది. ఈ కార్యక్రమం కంపెనీ తన బ్రాండ్ విలువని పెంచుకోవడంతో పాటు, కంపెనీ ఉత్పత్తులని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం, ఇండస్ట్రీ లీడర్స్ తో నెట్వర్కింగ్, కీలక భాగస్వామ్యాలని పెంపొందించేందుకు దోహదపడుతుంది.
ఈ మొబిలిటీ ఎక్స్‌పో కార్యక్రమం లో ఒలెక్ట్రా నవీన ఆవిష్కరణలైన బ్లేడ్ బ్యాటరీ చాసిస్, బ్లేడ్ బ్యాటరీ ప్లాట్ ఫాం (12 మీటర్లు), సరికొత్త శైలిలో తయారు చేసిన సిటీ బస్ (9 మీ.), కోచ్ బస్ (12 మీ) లను ప్రదర్శించింది. అత్యంత ఆధునిక ఆవిష్కరణలైన ఈ ఉత్పత్తుల ప్రదర్శన, దేశంలో పర్యావరణ అనుకూల ప్రజా రవాణాని పెంపొందించేందుకు తోడ్పడుతుంది.
బ్లేడ్ బ్యాటరీ టెక్నోలాజీ
ఎలెక్ట్రిక్ వాహనరంగ అభివృద్ధికై ఒలెక్ట్రా చేసిన ఆవిష్కరణల్లో బ్లేడ్ బ్యాటరీ అతి ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ బ్యాటరీలు మంచి పనితీరు, సమర్థత, నాణ్యత, భద్రతా ప్రమాణాలని కలిగి ఉంటాయి. వీటిని ధ్రువీకరించేందుకు నిర్వహించే నెయిల్ టెస్ట్, ఫ్యూరెన్స్ టెస్ట్ లాంటి క్లిష్టమైన పరీక్షలను తట్టుకొని నిపుణుల మన్ననలు పొందాయి. ఈ ఆధునిక బ్యాటరీలను బి.వై.డి అభివృద్ధి చేయడం జరిగింది.
బ్లేడ్ బ్యాటరీ 30% ఎక్కువ శక్తి నిల్వను అందిస్తూ, ఈ బస్సులను ఒకసారి ఛార్జర్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించగలిగేలా చేస్తుంది. ఈ బ్యాటరీ చిన్న పరిమాణం, స్వల్ప బరువుని కలిగి ఉండటం వలన వాహనం లో అధిక స్థలం మిగిలి సౌలభ్యంగా ఉంటుంది. ఈ బ్యాటరీని లైఫ్ టైంలో 5000 పైగా సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకే, ఇది విద్యుత్ వాహనాల కోసం మన్నికైన మరియు నాణ్యమైన ఉత్పత్తి.
బ్లేడ్ బ్యాటరీ ప్లాట్‌ఫామ్ ప్రారంభ కార్యక్రమంలో ఓలెక్ట్రా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె.వి.ప్రదీప్ గారు ప్రసంగిస్తూ, “ మేము కూడా అందరి లాగే చిన్నగా ప్రయాణం మొదలు పెట్టాము. కానీ, మా ఆలోచనలు, కలలు మాత్రం పెద్దవి గా ఉండేవి. 6 ఎలెక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ నుండి మైలురాయి వంటి, 5,150 బస్సుల తయారీ ఆర్డర్ వరకు ఎదిగాము అంటే అతిశయోక్తి కాదు. అది మా పట్టుదల, విజన్ & హరిత ప్రయాణం పట్ల మా నిబద్దతని తెలుపుతుంది. కర్బన ఉద్గారాలతో కూడిన రవాణా వ్యవస్థ ని సమూలంగా మార్చి పర్యావరణ సహిత, సుస్థిరాభివృద్ధి తో కూడిన పరిశ్రమ ని నెలకొల్పాలనే ఆలోచన మమ్మల్ని ఇంత దూరం నడిపించేందుకు ప్రేరణగా నిలిచింది. ఈ పరిశ్రమ లో, సవాళ్లు చాలానే ఉన్నాయి, కానీ ఓలెక్ట్రాలో సంకల్పం, సృజనాత్మకత, సహకారంతో వీటన్నింటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రస్తుతం బ్లేడ్ బ్యాటరీ టెక్నోలాజి అనేది ఆరంభం మాత్రమే. ఎల్లప్పుడూ ఎలెక్ట్రిక్ బస్సుల తయారీలో నూతన ఆలోచనలు, సృజనాత్మకత, ఆధునిక సాంకేతికత తో ఎలా ముందుకు వెళ్ళి మరింతగా అభివృద్ధి చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిశ్రమలో అవకాశాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మా దృష్టి తయారీ సామర్థ్యాలను పెంచడం, సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడంపైనే ఉంది.
ఈ అద్భుతమైన పర్యావరణ సహిత ప్రయాణంలో కలిసి నడుస్తున్న మా వ్యాపార భాగస్వాములు, వెండర్లు, షేర్ హోల్డర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరి నమ్మకం, సహకారమే మాకు ఈ స్థాయికి చేరడానికి సహాయపడింది. మనం అందరం కలిసి మరింత పర్యావరణ హిత మరియు సుస్థిరమైన అభివృద్ధి ని సాధిద్ధాం” అని తెలిపారు.
నూతన ఎలెక్ట్రిక్ బస్సుల ఫీచర్స్
ఒలెక్ట్రా బస్సులు ప్రయాణికుల సౌకర్యం, భద్రతను మెరుగుపరచేందుకు ఆధునిక ఫీచర్లతో రూపొందించాము. ఇవి పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ప్రయాణికుల కోసం USB చార్జింగ్ పోర్టులు, రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండిషనింగ్, కాంటిలీవర్ సీట్లు ఒక సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఇన్-వీల్ మోటార్లు, ఆధునిక బ్రేకింగ్ సిస్టమ్స్ వలన సులువైన, భద్రమైన ప్రయాణాన్ని కల్పిస్తాయి.
భద్రత, సౌకర్యం
ప్రయాణికుల భద్రత, సౌకర్యం ఓలెక్ట్రా డిజైన్ ముఖ్యమైన అంశాలు. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్లు (ADAS), GPS ట్రాకింగ్, CCTV కెమెరాలు వంటి ఫీచర్లు మెరుగైన భద్రతను అందిస్తాయి. ఎయిర్ సస్పెన్షన్ వలన ప్రయాణికులు సులువైన ప్రయాణ అనుభవాన్ని పొందుతారు. అంతేకాకుండా, ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి , ఫుట్ స్పేస్, మోకాళ్ళ కి తగినంతగా స్పేస్ ఉంటుంది. ఈ ప్రత్యేక సౌకర్యం వలన దివ్యాంగులతో పాటు అందరికి అణువుగా ఉంటుంది. వీల్చైర్ ర్యాంప్‌లు, సమ్మిళిత డిజైన్ ల వలన ఈ బస్సులు అందరికి ఆక్సెసెబుల్ గా ఉంటాయి.
2024 సెప్టెంబర్ 30 నాటికి, ఓలెక్ట్రా, 2,200 కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో భారత్ వ్యాప్తంగా ప్రజా రవాణా రూపు రేఖలని మార్చింది. ఈ బస్సులు 30 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, 2.7 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాయి. ఈ ప్రభావం, 1.24 కోట్ల చెట్లను నాటిన దానికి సమానం. ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల ఓలెక్ట్ యొక్క నిబద్దతని తెలియజేస్తుంది.
భారత్ గ్రీన్ మొబిలిటీ లీడర్
2024 సెప్టెంబర్ 30 నాటికి, ఓలెక్ట్రా, 2,200 కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో భారత్ వ్యాప్తంగా ప్రజా రవాణా రూపు రేఖలని మార్చింది. ఈ బస్సులు 30 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, 2.7 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాయి. ఈ ప్రభావం, 1.24 కోట్ల చెట్లను నాటిన దానికి సమానం. ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల ఓలెక్ట్ యొక్క నిబద్దతని తెలియజేస్తుంది.
డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులతో రీ ప్లేస్ చేయడం ద్వారా, ఒలెక్ట్రా సుమారు 10 కోట్ల లీటర్ల డీజిల్ను ఆదా చేసింది. ఈ ప్రభావం, శిలాజ ఇంధనాల పై ఆధారత ను, పట్టణ వాయు కాలుష్యాన్ని గణనీయ స్థాయి లో తగ్గించడమే కాకుండా ఆపరేషన్స్ ఖర్చులని కూడా తగ్గించింది. దీని ద్వారా కర్బన ఉద్గారాలని తగ్గించి గ్లోబల్ వార్మింగ్ ని నియంత్రించడం లో దోహదపడింది. అంతేకాకుండా, ఒలెక్ట్రా ఎలెక్ట్రిక్ టిప్పర్ల యొక్క నాయిస్ ఫ్రీ , పొల్ల్యుషన్ ఫ్రీ ఫీచర్స్ వలన నిర్మాణ, రహదారులు, మైనింగ్ వంటి రంగాల్లో అధ్బుతమైన పురోగతిని సాధించడానికి తోడ్పడింది.
ఒలెక్ట్రా బస్సులు 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నడుస్తూ, కోట్లాది ప్రయాణికులకు పర్యావరణ అనుకూలమైన ప్రయాణాలని కల్పిస్తుంది. ఈ ఆధునిక ఎలెక్ట్రిక్ బస్సులు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ ఉన్న అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో నిర్మించిన ప్రత్యేక ఉత్పత్తి కేంద్రంలో తయారవుతాయి.
ఒలెక్ట్రా కేవలం ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడం మాత్రమే కాదు, పర్యావరణ హితానికై పాటు పడే ఒక చోదకంగా పని చేస్తుంది. కంపెనీ ప్రతి ఆడుగు, ఆవిష్కరణ సుస్థిరాభివృద్ధి ని, ఆధునిక సాంకేతికతని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.
గ్రీన్ మొబిలిటీ లో సరికొత్త రికార్డులని సృస్టిస్తూ , హద్దులు లేని ఆవిష్కరణలని తయారు చేస్తూ భారత దేశం లో ప్రతి కిలో మీటర్ కి పర్యావరణ హిత ప్రయాణాన్ని అందించేందుకి కంకణం కట్టుకొని భవిష్యత్తు హరిత వెలుగుల కోసం ఒలెక్ట్రా కృషి చేస్తుంది.