ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఓటీటీ మాధ్యమం సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవంబర్ 15 న విడుదలైన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ హిస్టారికల్ సోషల్ పొలిటికల్ డ్రామాను మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. చిరాగ్ వోరా, సిద్ధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ ల్యూక్ మెక్‌గిబ్నే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మన దేశానికి స్వతంత్రం రావటానికి ఎందరో నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆనాటి పరిస్థితులను, ఇండియా విభజనకు దారితీసిన పరిణామాలను, మన నాయకులు- గాంధీ, నెహ్రూ, పటేల్ తదితరులు ఎదుర్కున్న సవాళ్లు, సంఘర్షణ, వాటిని ఎదుర్కున్న తీరును అద్భుతమైన మేకింగ్‌తో కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు మేకర్స్. నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. SCAM 1992, SCAM 2003,మహారాణి లాంటి బ్లాక్ బస్టర్ షోల తర్వాత, సోనీ లివ్ నుండి వచ్చిన మరొక అద్భుతమైన సిరీస్ – ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్…
ఇవి కూడా చదవండి
కాగా ఈ సిరీస్ ప్రమోషన్లలో దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ వంటి హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించాలనుకోవటం చాలా కష్టసాధ్యమైంది. అయితే దాన్ని మా మేకర్స్ నిజం చేశారు. నాటి వాస్తవ పరిస్థితులను ఈ సిరీస్ ద్వారా వివరించే ప్రయత్నం చేశాం. నవంబర్ 15 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్‌ను అలరిస్తుంది. ఈ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ షోని వివిధ దేశాలలోని మన భారతీయులకు చేరవేస్తోన్న సోనీ లివ్‌కు ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
The History You May Not Know The History You Should Know
Presenting the electrifying communicative of India’s Independence – Freedom At Midnight streaming present connected Sony LIV #FreedomAtMidnightOnSonyLIV #FAMOnSonyLIV pic.twitter.com/wyXNubDccD
— Sony LIV (@SonyLIV) November 17, 2024
నిర్మాతలు మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మనం ఈరోజు సంతోషంగా ఉండటానికి కారణం .. ఎందరో అమరవీరుల త్యాగఫలం. నాటి విషయాలను, దేశ విభజన సమయంలో మన నాయకులు ఎదుర్కొన్న కష్టాలను, రాజకీయ పరిస్థితులను నిఖిల్ అద్వానీగారు అద్బుతంగా తెరకెక్కించారు.
అందుబాటులో తెలుగు వెర్షన్ కూడా..
Catch the untold stories of powerfulness and pridefulness successful Freedom At Midnight, streaming lone connected Sony LIV.#FreedomAtMidnight #FreedomAtMidnightOnSonyLIV #FAMOnSonyLIV pic.twitter.com/Stvnzthwxr
— Sony LIV (@SonyLIV) November 28, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.