సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. అనుక్షణం ఊహించని ట్విస్టులు… క్షణ క్షణం వణుకుపుట్టించే సీన్లతో వచ్చే చిత్రాలకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ విశేషంగా వస్తుంది. ఇప్పటికే ఓటీటీలలో ఎన్నో థ్రిల్లర్ సస్పెన్స్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో కోలీవుడ్ క్రైమ్ డ్రామా అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే ది స్మైలీ మ్యాన్. తమిళంలో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇందులో శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా.. ఇనియా, సిజా రోజ్, జార్జ్ మరియమ్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ నెలాఖరున తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
ఈ క్రైమా డ్రామ్ సినిమా ది స్మైలీ మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఓ సీరియల్ కిల్లర్ ను అల్జీమర్స్ తో బాధపడుతున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్విస్టులతోపాటు శరత్ కుమార్ యాక్టింగ్ ఆకట్టుకుంది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడంతో ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు.
కథ విషయానికి వస్తే..
ఇన్వేస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా చిదంబరానికి (శరత్ కుమార్) డిపార్ట్ మెంట్ లో మంచి పేరు ఉంటుంది. ఎన్నో అసాధారణమైన కేసులను సులభంగా సాల్వ్ చేస్తాడు. కానీ అల్జీమర్స్ వ్యాధి అతడి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. గతం మొత్తం మర్చిపోతుంటాడు. అదే సమయంలో ది స్మైలీ మ్యాన్ పేరుతో ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. అతడిని పట్టుకోవడానికి చిదంబరం ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది.. ? చివరకు ఆ కిల్లర్ ను పట్టుకున్నాడా ? అనేది స్టోరీ.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..