పిల్లల ఎదుగుదలకు అవసరమైన జీవన నైపుణ్యాలను నేర్పించటం ఎంతో ముఖ్యం. వయసుకు అనుగుణంగా చిన్న చిన్న ఇంటి పనులు వారికి బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని నేర్పుతాయి. ఇది వారికి భవిష్యత్తులో ఉపయోగపడటమే కాకుండా.. కుటుంబంతో అనుబంధాన్ని కూడా పెంపొందిస్తుంది. పిల్లలకు నేర్పించాల్సిన ఇంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బెడ్ సర్దడం
ఉదయం నిద్రలేవగానే బెడ్ సర్దడం ఒక మంచి అలవాటు. పిల్లలకు బెడ్‌షీట్‌ను మడతపెట్టడం, పిల్లోస్ సర్దడం వంటి పనులను నేర్పడం వల్ల బెడ్ నీట్ గా ఉంచుకోవడంపై అవగాహన పెరుగుతుంది. ఈ విధానం వారు మంచి అలవాట్లతో పెరుగుతారు.
లంచ్ కి సంబంధించిన పనులు
భోజనం సమయంలో పిల్లలు ప్లేట్లు, స్పూన్లు, వాటర్ బాటిళ్లు తీసుకురావడం వంటి పనులను చేయడాన్ని అలవాటు చేయాలి. భోజనం తర్వాత టేబుల్ లేదా నేలపై ఆహారం పడితే తుడవడం కూడా వారికి నేర్పించాలి. ఇది వారికి శుభ్రత అంటే ఏమిటో తెలియజేస్తుంది.
వంటింటి పనులు
తిన్న తర్వాత ప్లేట్‌ను సింక్‌లో ఉంచడం, మిగిలిపోయిన ఆహారాన్ని చెత్త బుట్టలో వేయడం అలవాటు చేయాలి. 8 ఏళ్ల పైబడిన పిల్లలకు చిన్న పనులు, ప్లేట్‌లు కడగడం వంటి పనులను సులభంగా నేర్పవచ్చు. తల్లిదండ్రులు తాము కూడా వీటిని చేసుకుంటూ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.
బట్టలతో సంబంధమైన పనులు
పిల్లలు వారి బట్టలను వాషింగ్ మెషీన్‌లో ఉంచడం నేర్చుకోవాలి. అదే విధంగా.. ఉతికిన బట్టలను మడతపెట్టడం వారిలో క్రమశిక్షణను పెంచుతుంది. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ పెద్ద పనులను వారికి బాగా నొప్పించకుండా అప్పగించవచ్చు.
మొక్కల సంరక్షణ
ఇంట్లో ఉన్న మొక్కలకు నీరు పోసే బాధ్యతను పిల్లలపై పెట్టడం వల్ల వారు సహనంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమను కూడా పెంచుకుంటారు. మొక్కల పెంపకం ద్వారా వారిలో జాగ్రత్తగా ఉండే నైపుణ్యం పెరుగుతుంది.
చెత్త వేయడం, శుభ్రత
చిన్న వయసులోనే పిల్లలకు చెత్తను చెత్తబుట్టలో వేయడం అలవాటు చేయాలి. ఇంటి శుభ్రత వారిలో ఒక ప్రాథమిక బాధ్యతగా మారుతుంది. పిల్లలు తమకు నచ్చిన పనులను ఎంచుకునేలా చేయడం, వారు చేయలేని పని వచ్చినప్పుడు ఓపికగా నేర్పించడం తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత. హోంవర్క్ అనేది పిల్లల వ్యక్తిత్వం మెరుగుపరచడానికి ఉపయోగపడే ఒక విలువైన ఉపాయంగా మారుతుంది.