Personality Test: మీరు రాసేటప్పుడు పెన్ను పట్టుకునే విధానం.. మీరెలాంటి వారో చెప్పేస్తుంది! ఎలాగంటే..

10 hours ago 1

ఏ ఇద్దరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు. ఒకేలా మాట్లాడడం.. ఒకేలా నడవడం, ఒకేలా కూర్చోవడం.. ఇలా ఏ విషయంలోనూ పోలిక ఉండదు. కానీ మనుషులు చేసే కొన్ని పనుల వల్ల, శరీరంలోని కొన్ని భాగాల పరిమాణాన్ని బట్టి వారి అంతర్గత వ్యక్తిత్వాలు ఇట్టే కనిపెట్టోయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కంటి, చెవి, ముక్కు, నాలుక, నుదురు ఆకారం వీటి ఆధారంగా మనస్తత్వాలు తెలుసుకోవచ్చు. ఇలాంటిదే మనం చేతితో పెన్ను పట్టుకునే విధానం కూడా. అవును.. చేతిలో రాసేటప్పుడు పెన్ను పట్టుకునే విధానం అందరిలో ఒకేలా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కోరీతిలో పట్టుకుంటూ ఉంటారు. ఇలా పెన్ను పట్టుకునే విధానం కూడా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మీరు ఎవరైనా ఒక పెన్ను ఇస్తే, ఆ వ్యక్తి దానిని తమదైన శైలిలో పట్టుకుంటాడు. కొందరు రెండు వేళ్ల సహాయంతో పెన్ను సులువుగా పట్టుకుంటే.. మరికొందరు దిగువ పూర్తి వాల్యూమ్‌ను గట్టిగా నొక్కి పట్టుకుంటారు. పెన్ను ఎలా పట్టుకుంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మధ్య పెన్ను పట్టుకుంటే..

బొటనవేలు, చూపుడు వేలు, వేలు మధ్య పెన్ను పట్టుకునే వ్యక్తులు ద్వంద్వ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు కొన్ని విషయాలు, వ్యక్తుల గురించి విమర్శనాత్మకంగా ఆలోచిస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా దయ, కరుణ స్వభావం కలిగి ఉంటారు. ఎప్పటికీ సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. తప్పులు చేయడం వీరు ఇష్టపడరు. తమ వల్ల జరిగిన తప్పులు జరిగినప్పుడు విశ్లేషించి, నిర్ణయాలు తీసుకుంటారు. వారు పరిస్థితిని బట్టి భావోద్వేగంతో పాటు విశ్లేషణాత్మక వ్యక్తులుగా వ్యవహరిస్తారు.

చూపుడు వేలు, మధ్య వేలు మధ్య పెన్ను పట్టుకుంటే..

ఈ విధమైన వ్యక్తులు చూపుడు వేలు, మధ్య వేలు మధ్య పెన్ను పట్టుకుని రాస్తుంటారు. వీరు పూర్తిస్థాయిలో జీవించడానికి ఇష్టపడతారు. ప్రియమైన వారు చేసిన తప్పులను గుర్తుంచుకోవడానికి ఇష్టపడరు. వీరిలో క్షమాపణ గుణం ఎక్కువగా ఉంటుంది. పగ తీర్చుకునే వ్యక్తులు, గాసిప్స్ క్రియేట్‌ చేసే వారికి దూరంగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా, గౌరవంగా చూడటానికి ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

పెన్ను పట్టుకునేందుకు బొటనవేలును ముందుకు లాగి పట్టుకుంటే..

ఈ విధంగా పెన్ను పట్టుకొనే వ్యక్తులు మరింత ప్రతిష్టాత్మకంగా ఉంటారు. భావోద్వేగాలు వీరిలో ఎక్కువ. ఇతరులు చేసే తప్పుల వల్ల బాధ అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవర్‌ థింకింగ్‌ చేస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో వీరు యాంగ్జైటీకి గురవుతారు. తమకు సహాయం చేసిన వ్యక్తి ఎప్పటికీ మరచిపోరు. వాని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు. ప్రతికూల పరిస్థితుల వల్ల సులభంగా బాధకు లోనవుతుంటారు. నమ్మదగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఈ వ్యక్తులను స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతో ఇష్టపడతారు.

చూపుడు వేలు, బొటనవేలు మధ్య పెన్ను పట్టుకునే విధానం..

ఈ విధంగా పెన్ను పట్టుకునే వారు రహస్యమైన వ్యక్తులు. వారు చేసే పని గురించి వారు వెల్లడించరు. వీరు అందరినీ దగ్గరగా గమనిస్తున్న ఎక్స్ట్రోవర్ట్స్. ఈ వ్యక్తుల్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు తమ భావాలను చూపించడానికి ఇష్టపడరు. మితిమీరిన ఉత్సాహం వల్ల ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article