ఇండస్ట్రియల్ ఛాంబర్ సీఐఐ ప్రకారం మేక్ ఇన్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వివిధ రంగాలకు ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహక పథకాలు (పీఎల్ఐ) భారతదేశంలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సహాయపడుతున్నాయని పేర్కొంది. రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెంచడంతో దేశీయ పరిశ్రమను మరింత పోటీగా మారుస్తున్నాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశానికి అనుకూలంగా మారడంతో అదే సమయంలో భారతదేశంలో విధాన మార్పు కూడా సంభవించిందని అనేక ప్రపంచ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విస్తరించాలని చూస్తున్నాయని నవంబర్ 5న రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోలు 2014-15లో 45.14 బిలియన్‌ల డాలర్ల నుంచి 2023-24 నాటికి 70.95 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. ఈ పెట్టుబడుల పెంపుతో భారతదేశంలో ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడానికి విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా పీఎల్ఐ పథకాలు భారీ పెట్టుబడులను ఆకర్షించాయి.
ఆటో, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, కెమికల్స్, షిప్పింగ్, రైల్వేస్, ఇతర రంగాలలో భారతదేశానికి సంబంధించిన తయారీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా చొరవలోని ప్రతి అంశాన్ని, వ్యాపారాన్ని సులభతరం చేయడం, లాజిస్టిక్స్, కనెక్టివిటీ, పెట్టుబడి ప్రమోషన్ విషయాల్లో వినూత్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి