న్యూఢిల్లీ, నవంబర్ 7: మాజీ సైనికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేస్తూ గురువారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మాజీ సైనికులకు ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అమలు చేయడం మన వీరులకు దేశం నివాళి తెల్పడంతో కీలకమైన ఘట్టమని అన్నారు. ఈ మేరకు మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మోదీ పోస్టులో ఇంకా ఈ విధంగా పేర్కొన్నారు.. ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ (OROP) పథకం మాజీ సైనికుల ధైర్యం, త్యాగాలకు నివాళి అని కొనియాడారు. పదేళ్ల క్రితం 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ వాగ్దానం చేసిన పథకం ఈ రోజున ‘వన్ ర్యాంక్, ఒక పెన్షన్’ (OROP) అమలులోకి వచ్చింది. గురువారంతో దశాబ్ధం పూర్తైంది. మన దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన మన మాజీ సైనిక సిబ్బంది ధైర్యం, త్యాగాలకు ఇది నివాళి. OROPని అమలు చేయాలనే నిర్ణయం మన హీరోలకు మన దేశ కృతజ్ఞతను పునరుద్ఘాటించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు. దశాబ్ద కాలంగా లక్షలాది మంది పెన్షనర్లు, పెన్షనర్ కుటుంబాలు ఈ మైలురాయి చొరవతో లబ్ది పొందడం సంతోషాన్ని కలిగిస్తుంది. మన సాయుధ బలగాల శ్రేయస్సు పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను OROP సూచిస్తుంది. సాయుధ బలగాలను బలోపేతం చేయడానికి, దేశానికి సేవ చేసే వారి సంక్షేమం కోసం సాధ్యమైన ప్రతిదాన్ని చేయడానికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
ఇవి కూడా చదవండి
On this day, #OneRankOnePension (OROP) was implemented. This was a tribute to the courageousness and sacrifices of our veterans and ex-service unit who dedicate their lives to protecting our nation. The determination to instrumentality OROP was a important measurement towards addressing this…
— Narendra Modi (@narendramodi) November 7, 2024
కాగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకం 10వ వార్షికోత్సవాన్ని నవంబర్ 7 నుండి 8 వరకు ఢిల్లీలోని మానేక్షా సెంటర్‌లో డైరెక్టర్స్ కాన్‌క్లేవ్‌తో పాటు జరుపుకోనున్నారు. OROP పథకం అమలులోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా నవంబర్ 7న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. OROP అమలులోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 25 లక్షల మందికి పైగా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు.