PM Modi: కొనసాగుతోన్న మోదీ అమెరికా పర్యటన.. బైడెన్‌తో కీలక భేటీ

1 hour ago 2

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి అమెరికాకు పయనమయ్యారు. ఇందులో భాగంగానే తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు మోదీ. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం.. ఇజ్రాయిల్‌-గాజా యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.

అలాగే విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్‌ సదస్సుకు మోదీ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు ఆస్ట్రేలియా పీఎం, జపాన్‌ ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇండో- పసిఫిక్‌ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో- పసిఫిక్‌ రీజియన్‌లో క్యాన్సర్‌ టెస్టింగ్‌ కోసం 7.5 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించారు మోదీ. బైడెన్‌తో జరిగిన భేటీ తర్వాత భారత్‌లో సర్వైకల్‌ క్యాన్సర్‌ చికిత్స విధానంపై మాట్లాడారు ప్రధాని మోదీ.

భారత్‌లో సర్వైకల్‌ క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్‌ విజయవంతంగా కొనసాగుతోందన్నారు మోదీ. మందులను తక్కువ ధరకు అందించేందుకు తాము ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ చికిత్స విధానాన్ని ఇతర దేశాలకు తెలియజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 2025లో క్వాడ్‌ సదస్సు నిర్వహించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

PM @narendramodi participated successful the Quad Leaders’ Summit alongside @POTUS @JoeBiden of the USA, PM @kishida230 of Japan and PM @AlboMP of Australia.

During the Summit, the Prime Minister reaffirmed India’s beardown committedness to Quad successful ensuring a free, unfastened and inclusive… pic.twitter.com/TyOti2Rbc9

— PMO India (@PMOIndia) September 22, 2024

ఇక న్యూయార్క్‌లోని యూఏ జనరల్ అసెంబ్లీలో ప్యూచర్ సదస్సులో కూడా మోదీ పాల్గొననున్నారు. అదే విధంగా పలువురు వ్యాపార వేత్తలో మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడుల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని హోదాలో మోదీ అమెరికా పర్యటన వెళ్లడం ఇది తొమ్మిదో సారి కావడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది మంది భారత ప్రాధానులు అధికారికంగా అమెరికా పర్యటన వెళ్లారు.

Had a precise bully gathering with PM Kishida. Discussed practice successful infrastructure, semiconductors, defence, greenish vigor and more. Strong India-Japan ties are large for planetary prosperity. @kishida230 pic.twitter.com/qK4VJnUDtq

— Narendra Modi (@narendramodi) September 22, 2024

Glad to person met Quad Leaders during today’s Summit successful Wilmington, Delaware. The discussions were fruitful, focusing connected however Quad tin support moving to further planetary good. We volition support moving unneurotic successful cardinal sectors similar healthcare, technology, clime alteration and capacity… pic.twitter.com/xVRlg9RYaF

— Narendra Modi (@narendramodi) September 22, 2024

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article