మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు NCP చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా ఎక్కువ స్థానాల్లో సీట్లు గెలుచుకున్నాయి. దీంతో మహాయుతి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 132 స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది.. అంటే పోటీ చేసిన చాలా స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. శివసేన షిండే వర్గం కూడా 81 స్థానాల్లో పోటీ చేసి 56 స్థానాల్లో, ఎన్సీపీ అజిత్‌పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది.. మహావికాస్ అఘాడీ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.. కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబర్చింది. శివసేన ఉద్దవ్ వర్గం 95 సీట్లలో పోటీ చేసి 20 స్థానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక శరదపవార్ పార్టీ ప్రదర్శన చాలా ఘోరంగా పడిపోయింది.. 86 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించింది.. మొత్తానికి బీజేపీ హవా ముందు కాంగ్రెస్ కూటమి చతికలపడిపోయింది.
ప్రధాని మోదీ సంచలన ట్వీట్..
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన గెలిచింది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన గెలుస్తుంది!.. ఐక్యంగా మేము మరింత ఎత్తుకు వెళ్తాము..
NDAకి చారిత్రాత్మక విజయం ఇచ్చినందుకు మహారాష్ట్రలోని నా సోదరీమణులు – సోదరులకు, ముఖ్యంగా రాష్ట్ర యువత, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఆప్యాయత.. విజయం అసమానమైనది.
మహారాష్ట్ర ప్రగతికి మా కూటమి నిరంతరం కృషి చేస్తుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. జై మహారాష్ట్ర!’’
అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు..
మోదీ ట్వీట్..
Development wins!
Good governance wins!
United we volition soar adjacent higher!
Heartfelt gratitude to my sisters and brothers of Maharashtra, particularly the younker and women of the state, for a historical mandate to the NDA. This affection and warmth is unparalleled.
I guarantee the…
— Narendra Modi (@narendramodi) November 23, 2024
మర్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..