PM Modi: నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు.. ప్రధాని మోదీ విషెస్..

2 hours ago 2

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌ చరిత్రాత్మక విజయం సాధించారని X లో ట్విట్ చేశారు. తమ మైత్రి వల్ల భారత్‌-అమెరికా బంధం బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల జీవితాలు మెరుగుపరుద్దమని, ప్రపంచ శాంతి, సుస్థితర, శ్రేయస్సు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయ దుందుభి మోగిస్తున్నారు. ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270 దాటేశాడు.. స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ సత్తా చాటారు.  ఈ ఫలితాలపై ట్రంప్ కూడా స్పందించాడు. తన జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాకు పూర్వవైభవం తెస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తానని, తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందన్నారు.

మోదీ చేసిన ట్విట్

Heartiest congratulations my person @realDonaldTrump connected your historical predetermination victory. As you physique connected the successes of your erstwhile term, I look guardant to renewing our collaboration to further fortify the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY

— Narendra Modi (@narendramodi) November 6, 2024

స్వింగ్ రాష్ట్రాల్లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెపుకొచ్చారు. తనకు 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెనెట్‌తో పాటు కాంగ్రెస్‌లో కూడా తమకే ఆధిక్యమని ఉందన్నారు. కొత్త చట్టాలను తీసుకురావడానికి తమకు ఇబ్బందులు లేవని, అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని చెప్పారు. అసాధ్యాన్ని అమెరికా ప్రజలు సుసాధ్యం చేశారన్నారు. ఎవరైనా చట్టబద్ధంగానే దేశంలోకి రావాలని, సరిహద్దులను నిర్ణయిస్తామన్నారు. మస్క్ సహా తన విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయంలో ఎలాన్ మస్క్‌దే కీలకపాత్ర  ఉందని, అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని కొనియాడారు.  ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తనకు సరైన ఛాయిస్ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article