PM Modi: ప్రధాని మోదీ థింకింగే వేరబ్బా.. భారతదేశ వారసత్వ చరిత్రను తెలియజేసేలా నేతలకు బహుమతులు..

6 hours ago 1

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. నైజీరియా, బ్రెజిల్‌, గయనా దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ.. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.. అయితే.. ప్రధాని మోదీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆయా దేశాల నేతలకు బహుమతులు అందించడం .. ఆనవాయితీగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంవత్సరాలుగా భారతదేశ విదేశీ దౌత్యాన్ని సాంస్కృతిక వైవిధ్యం శక్తివంతమైన ప్రదర్శనగా మార్చారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.. ప్రతి అంతర్జాతీయ పర్యటనతో ప్రధానమంత్రి మోదీ భారతదేశం దౌత్యపరమైన అజెండాను మాత్రమే కాకుండా, మన దేశ సంప్రదాయాలు, భాషలు, కళలు, ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తూ గొప్ప వారసత్వాన్ని కూడా తీసుకువెళుతున్నారు. అక్కడి నేతలకు మన దేశ కళా వైభవం ఉట్టి పడేలా.. చరిత్ర నాగరికతకు ప్రతీక నిలిచే ఖళా ఖండాలను అందిస్తున్నారు.

సంస్కృతి – దౌత్యం ఈ ప్రత్యేకమైన సమ్మేళనం ద్వారా భారతదేశం సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేలా ప్రధాని మోదీ ఈ విధంగా ఆలోచిస్తారు.. ఆచరిస్తారు.. ఇలా.. ప్రతి విదేశీ పర్యటనతో.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని పరిచయం చేయడంతోపాటు.. భారత దేశ గౌరవాన్ని అక్కడ చిరకాలం నిలిచిపోయేలా చేస్తారు.

నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ తనతోపాటు దేశం నలుమూలల నుంచి ప్రత్యేకమైన బహుమతులు తీసుకువెళ్లారు. ఈ పర్యటనలో, ప్రధానమంత్రి తనతో పాటు మహారాష్ట్ర నుంచి 8, జమ్మూ & కాశ్మీర్ నుంచి 5, ఆంధ్ర ప్రదేశ్ నుంచి 3, రాజస్థాన్ నుంచి 3, జార్ఖండ్ నుంచి 2, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, లడఖ్ నుంచి ఒక్కొక్కటి చొప్పున బహుమతులను తీసుకువెళ్లారు.

Pm Modi Gifts

Pm Modi Gifts

ఈ అధ్యుతమైన కళాఖండాలను ప్రధాని మోదీ ఎవరెవరికి అందించారంటే..

మహారాష్ట్ర నుంచి వచ్చిన బహుమతులలో సిలోఫర్ పంచామృత కలాష్ (పాట్) – మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి నైజీరియా అధ్యక్షునికి ఇచ్చిన సాంప్రదాయ హస్తకళకు అద్భుతమైన ఉదాహరణ.. వార్లీ పెయింటింగ్స్ – ప్రధానంగా మహారాష్ట్రలోని దహను, తలసరి,పాల్ఘర్ ప్రాంతాలలో ఉన్న వార్లీ తెగ నుంచి ఉద్భవించిన గిరిజన కళారూపం.. ఇది బ్రెజిల్ అధ్యక్షుడికి ఇచ్చారు. ఇంకా CARICOM దేశాల నాయకులకు ఇచ్చే కస్టమైజ్డ్ గిఫ్ట్ హాంపర్‌లోని బహుమతులలో ఇది కూడా ఒకటి..

పూణే నుంచి వెండి ఒంటె తలపై ఉన్న సహజ రఫ్ అమెథిస్ట్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రికి ఇచ్చారు. చేతితో చెక్కిన సిల్వర్ చెస్ సెట్, పోర్చుగల్ ప్రధాన మంత్రికి అందించారు.

ఇటలీ ప్రధానమంత్రికి అందించిన అద్భుతమైన సిల్వర్ క్యాండిల్ స్టాండ్ – నెమలి – చెట్టు క్లిష్టమైన వర్ణనలను కలిగి ఉన్న చేతితో చెక్కిన సిల్వర్ ఫ్రూట్ బౌల్, CARICOM సెక్రటరీ జనరల్‌కు అందించారు.

జమ్మూ కశ్మీర్ సంస్కృతి ఉట్టిపడే.. ఒక జత పేపియర్-మాచే బంగారు పని కుండీల బహుమతులను UK ప్రధాన మంత్రికి అందించారు. పేపియర్ మాచే బాక్స్‌లో పష్మీనా శాలువ కూడా ఉంటుంది.. అలాగే. CARICOM దేశాల నాయకులకు అందించారు.. అంతేకాకుండా హాంపర్‌లో గయానా ప్రథమ మహిళకు వాటితోపాటు కాశ్మీరీ కుంకుమపువ్వును అందించారు.

రాజస్థాన్ కు చెందిన బహుమతులు అర్జెంటీనా అధ్యక్షుడికి ఇచ్చారు.. వివరణాత్మక మెటల్ వర్క్ – సాంప్రదాయ మూలాంశాల రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే పూల పనితో కూడిన సిల్వర్ ఫోటో ఫ్రేమ్; ‘మార్బుల్ ఇన్లే వర్క్’, రాజస్థాన్‌లోని మక్రానా నుంచి సేకరించిన బేస్ మార్బుల్‌తో ‘పియెట్రా దురా’ అని కూడా పిలుస్తారు, ఇది నార్వే ప్రధానమంత్రికి ఇచ్చారు.. గోల్డ్ వర్క్ వుడెన్ రాజ్ సవారీ బొమ్మ – గయానా ప్రధాన మంత్రికి అందించారు.. ఇది మెత్తగా చెక్కబడిన చెక్కతో క్లిష్టమైన బంగారు పనిని కలిపి, సాంప్రదాయ భారతీయ హస్తకళకు అందమైన ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఆంద్రప్రదేశ్ నుంచి వచ్చిన బహుమతులలో సిల్వర్ క్లచ్ పర్స్‌తో కూడిన సిల్వర్ క్లచ్ పర్స్, క్లిష్టమైన పూల మోటిఫ్ డిజైన్‌లతో చేతితో తయారు చేసిన బహుమతులను బ్రెజిల్ ప్రెసిడెంట్ జీవిత భాగస్వామికి అందించారు.. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో పండించే అరకు కాఫీని కస్టమైజ్ చేసిన బహుమతిగా CARICOM దేశాల నాయకులకు అందించారు.

హజారీబాగ్ నుంచి సోహ్రాయ్ పెయింటింగ్ – జంతువులు, పక్షులు, ప్రకృతి చిత్రణకు ప్రసిద్ధి చెందింది.. వ్యవసాయ జీవనశైలి – గిరిజన సంస్కృతిలో వన్యప్రాణుల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.. దీనిని నైజీరియా వైస్ ప్రెసిడెంట్‌కు ఇచ్చారు. ఖోవర్ పెయింటింగ్ – జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతాల నుండి ఉద్భవించిన సాంప్రదాయక కళారూపం, ఇండోనేషియా అధ్యక్షుడికి ఇచ్చారు. ఇది జార్ఖండ్ సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తుంది.

ఇతర బహుమతులలో ఉత్తరప్రదేశ్ నుంచి ఫైన్లీ ఫ్రెటెడ్.. చెక్కబడిన వెండి.. రోజ్‌వుడ్ సెరిమోనియల్ ఫోటో ఫ్రేమ్.. దీనిని చిలీ అధ్యక్షుడికి ఇచ్చారు.. చెక్క బొమ్మ రైలు, కర్ణాటకలోని చిన్న పట్టణం చన్నపట్నా నుంచి తీసుకెళ్లిన బహుమతిని గయానా అధ్యక్షుడి చిన్న కుమారుడికి ఇచ్చారు.. తమిళనాడు నుండి తంజోర్ పెయింటింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఇచ్చారు.. మధుబని పెయింటింగ్, మిథిలా పెయింటింగ్ అని కూడా పిలుస్తారు.. ఇది బీహార్‌లోని మిథిలా ప్రాంతం నుంచి ఉద్భవించిన సాంప్రదాయ కళారూపం, గయానా అధ్యక్షుడికి ఇచ్చారు.. స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడిన అరుదైన, అద్భుతంగా రూపొందించిన ఫిలిగ్రీ బోట్ – గయానా వైస్ ప్రెసిడెంట్‌కి ఇచ్చిన శతాబ్దాల నాటి సిల్వర్ ఫిలిగ్రీ కళ, ఒడిశాలోని కటక్‌లో రూపొందించింది.. సెమీ విలువైన రాళ్లతో అలంకరించబడిన లడఖీ కెటిల్, గయానా నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌కి ఇచ్చారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article