ప్రస్తుత కాలంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్ ప్రణాళికలో బీమా ఉండటం ఎంతో మేలు. చాలా మంది ఆదాయం లేకపోవడంతో బీమా కొనుగోలు చేయలేకపోతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి బీమా యోజనను తీసుకొచ్చింది. ఈ పథకంలో మీరు 20 రూపాయలకు 20 లక్షల రూపాయల బీమా పొందవచ్చు.
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన 2015లో ప్రారంభమైంది. ఇందులో కేవలం 20 రూపాయలతోనే రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు. ఇది ప్రమాద బీమా పథకం. ఈ పథకం కింద 2 లక్షల వరకు బీమా కవరేజీ పొందవచ్చు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం వార్షిక ప్రీమియం రూ.20 మాత్రమే ఈ పాలసీని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Health Tips: నీళ్లు తాగినా మళ్లీ దాహం వేస్తోందా? ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతమా?
ఇవి కూడా చదవండి
ఈ పథకం ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు?
ఈ పథకంలో పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. మరోవైపు ప్రమాదంలో పాలసీదారు రెండు కళ్లు పోగొట్టుకుంటే కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. అదే విధంగా రెండు చేతులు, రెండు కాళ్లు వైకల్యం కలిగి ఉంటే, బీమా చేయబడిన కుటుంబానికి పరిహారంగా రూ.2 లక్షలు అందుతుంది. బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదంలో కాలు, చేయి లేదా కన్ను పోగొట్టుకుంటే రూ.లక్ష లభిస్తుంది.
మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?
1 ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన ప్రయోజనాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ చేసుకోవచ్చు.
2 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ https://www.jansuraksha.gov.in/ని సందర్శించాలి.
3. ఆ తర్వాత మీరు ఫారమ్‌లపై క్లిక్ చేయాలి.
4 అప్పుడు మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఎంపికపై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేసి, ఆపై మీ భాషను ఎంచుకోండి. ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని తప్పనిసరిగా నింపాలి.
6. దీనితో పాటు మీరు సంబంధిత పత్రాలను జోడించడం ద్వారా ఫారమ్‌ను సమర్పించాలి.
7 ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, మీరు మీ బ్యాంకును సందర్శించాలి.
ఇది కూడా చదవండి: Hair Care Tips: చిన్న వయస్సులోనే జుట్టు రాలుతుందా..? ఈ మూడు ప్రధాన కారణాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి