నిన్నటిదాకా ఒక తీరు.. ఇవాళ ఇంకో తీరు అని అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. కొత్త ఏడాది సరికొత్త రూల్స్ తో ముందుకు సాగుదామని ఫిక్సయ్యారు. అందులో భాగంగానే ఒన్ బై ఒన్ అంటున్నారు. హమ్మయ్య డార్లింగ్ డెసిషన్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ నాకే అని ఊపిరి పీల్చుకుంటున్నారు మారుతి. ఇంతకీ డార్లింగ్ డెసిషన్ ఏంటి అంటారా? చూసేద్దాం వచ్చేయండి..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 07, 2025 | 2:15 PM
రాజా సాబ్ సినిమా టాకీ మొత్తం పూర్తయింది. జస్ట్ ఇంకో సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆ సాంగ్‌ని కూడా ఇమీడియేట్‌గా పూర్తి చేస్తారు ప్రభాస్. సో, ప్రభాస్ తీసుకున్న నయా డెసిషన్ వల్ల మారుతి ఫుల్ సేఫ్.
1 / 5
రాజా సాబ్ కంప్లీట్ కాగానే ఫౌజీ సెట్స్ కే వెళ్తారు డార్లింగ్. ఎట్ ఎ స్ట్రెచ్ 60 రోజుల కాల్షీట్ ఇచ్చేశారు ఈ మూవీకి. ఇక్కడ టాకీ పూర్తయ్యాక ఫారిన్‌లో పాటలను షూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది ఫౌజీ టీమ్.
2 / 5
ఆ తర్వాత స్పిరిట్‌కి ఫుల్ కాల్షీట్ కేటాయించాలన్నది ప్లాన్. దీని వల్ల ఆయా సినిమాల లుక్ విషయంలో డిస్టర్బెన్స్ ఉండదు. కేరక్టర్ మూడ్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్నది డార్లింగ్ నిర్ణయం.
3 / 5
సో, ఫౌజీ, స్పిరిట్ టైమ్‌లో అటూ ఇటూ చూడరన్నమాట యంగ్ రెబల్‌స్టార్. దీన్ని బట్టి సలార్ సీక్వెల్ శౌర్యాంగపర్వం స్టార్ట్ కావడానికి మరింత సమయం పడుతుందనే క్లారిటీ వచ్చేసింది.
4 / 5
నాగ్ అశ్విన్ కల్కి మూవీతో రెడీగా ఉంటే, కల్కి సీక్వెల్‌ని ముందుకు జరిపి, సలార్‌ని ఆ నెక్స్ట్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది డార్లింగ్ కాంపౌండ్‌లో వినిపిస్తున్న మరో ముచ్చట. అప్పటి సంగతి అప్పటిది.. ఇప్పుడైతే ఇమీడియేట్‌గా న్యూ ఇయర్ రెసొల్యూషన్ అమల్లోకి వచ్చేయడం హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్.
5 / 5