సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రెటీలు కూడా ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. రోజులో ఎక్కువ సమయం ఫోన్ లోనే గడిపేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాను, మొబైల్‌ను తక్కువగా ఉపయోగిస్తున్నారు. రామ్ చరణ్ కూడా మొబైల్‌ను చాలా తక్కువగా వాడుతుంటారు. ఈ విషయాన్నీ మరో మెగా హీరో వరుణ్ తేజ్ వెల్లడించారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.. వరుణ్, రామ్ చరణ్‌ని చాలా దగ్గరగా చూస్తుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ మెసేజ్ లను సరిగా చూడరని వరుణ్ అన్నారు.
ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
‘నా సినిమా టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ అయితే ముందుగా రామ్ చరణ్ కి ఫోన్ చేయాలి. నేను మెసేజ్ చేశాను కాస్త చూడు అని ఫోన్ చేసి చెప్పాలి. కేవలం మెసేజ్ పంపి చరణ్ నుంచి రిప్లై ఆశించలేను’ అని వరుణ్ తేజ్ అన్నారు. ఇది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 307 పోస్ట్‌లను మాత్రమే షేర్ చేశారు. ఆయనకు రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి :మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే
వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మట్కా’. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. కాగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పుడు టీజర్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.