గతేడాది పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ ప్రపంచం మొత్తం మారుమోగింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఛాావా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
Updated on: Feb 12, 2025 | 8:17 PM
రష్మిక మందన్నా.. ఇప్పుడు ఛావా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
1 / 5
ఇందులో మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఆయన సతీమణి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
2 / 5
యానిమల్, పుష్ప 2 తర్వాత , రష్మిక మందన్న మరో భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రంలో నటించనుంది. ఛావా చిత్రంలో మహారాణి యేసుబాయి పాత్రను పోషిస్తుంది. తన పాత్ర కోసం రూ.4 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
3 / 5
ఇందులో మొఘల్ షహెన్‌షా ఔరంగజేబు పాత్రలో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం అతడు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం.
4 / 5
అలాగే ఇందులో హీరోగా నటిస్తున్న విక్కీ కౌశల్ తన పాత్రకు ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో విక్కీ కౌశల్, రష్మిక కలిసి పాల్గొంటున్నారు.
5 / 5