అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అదానీపై కేసుతో బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు సంధిస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియకుండానే అదానీతో ఒప్పందాలు జరిగాయా అంటూ ప్రశ్నిస్తోంది.. అదానీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు..
CM Revanth Reddy
అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అదానీపై కేసుతో బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు సంధిస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియకుండానే అదానీతో ఒప్పందాలు జరిగాయా అంటూ ప్రశ్నిస్తోంది.. అదానీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు.. ఈ మేరకు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విరాళాలు సేకరించామని.. చాలామంది విరాళాలు ఇచ్చారని సీఎం తెలిపారు. అందులో భాగంగానే రూ.100 కోట్లు అదానీ ఇస్తామన్నారని తెలిపారు. అదానీ నుంచి నిధులు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అదానీ డబ్బు తెలంగాణకు వద్దని.. రూ.100 కోట్లు నిరాకరిస్తూ అదానీకి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోలేదని.. అందులో అదానీ నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.. ఆదానీ పై కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2వేల 29 కోట్లు లంచాలు ఇచ్చారనే అభియోగంపై గౌతం అదానీ సహా ఏడుగురిపై న్యూయార్క్‌లో కేసు ఫైలయింది. అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు- ముడుపుల వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో రాజకీయ తుఫాన్‌గా మారింది. రెండు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చారు.