ప్రస్తుతం ఫామ్ కోసం కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను కదిలిస్తూ, రోహిత్ శర్మపై ఉన్న ప్రేమను మరోసారి చాటిచెప్పింది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ప్రస్తుతం టీమిండియాను టెస్టులు, వన్డేల్లో సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమిండియా విఫలమైన నేపథ్యంలో రోహిత్‌పై విమర్శలు మొదలయ్యాయి. ఫామ్ తిరిగి పొందడానికి రంజీ మ్యాచ్ కూడా ఆడిన రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో, రోహిత్‌కి ఓ అభిమాని రాసిన ఎమోషనల్ లేఖ వైరల్‌గా మారింది.
లేఖలో ఏముంది?
“నా ఆరాధ్య దేవుడైన రోహిత్ శర్మగారికి, మీరు గ్రేటెస్ట్ బ్యాటర్ ఆఫ్ ఆల్ టైమ్. మీ కోసం ఈ అందమైన క్రికెట్‌ను చూస్తున్నాను. ఫామ్ అనేది తాత్కాలికం కానీ క్లాస్ పర్మనెంట్. మీ ఆటను చూస్తూ పెరిగిన నేను చాలా అదృష్టవంతుడిని. రంజీ మ్యాచ్‌లో మీరు కొట్టిన మూడు సిక్సర్లు అద్భుతం. మీ ప్రతి ఇన్నింగ్స్ నాకు ప్రేరణ.
మీ నాయకత్వం అద్భుతం. మీలా అన్ని ఫార్మాట్లలో విజయం సాధించిన కెప్టెన్ అరుదుగా కనిపిస్తాడు. ప్లీజ్ రిటైర్ అవ్వకండి. మీరు ఓపెనింగ్‌కు మైదానంలోకి నడవకపోతే, నేను టీవీ ఆన్ చేయగలనా అనే ఆలోచనే నన్ను బాధిస్తుంది.
నేను 15 ఏళ్ల వయస్సు ఉన్న బాలుణ్ణి. స్పోర్ట్స్ అనలిస్ట్ అవ్వడమే నా కల. నేను రాజస్థాన్ రాయల్స్‌తో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాను. మీకు హేటర్స్ ఉండొచ్చు, కానీ మీ సక్సెస్ తార్కాణం. ఐ లవ్ యూ రోహిత్! మీరు త్వరలోనే ఫామ్‌లోకి వస్తారని నాకు నమ్మకం ఉంది.”
ఈ లేఖ ద్వారా అభిమాని తన ప్రేమను, విశ్వాసాన్ని రోహిత్‌కి అద్భుతంగా వ్యక్తపరిచాడు. ఇది నెటిజన్లను మాత్రమే కాకుండా, రోహిత్ శర్మ అభిమానులను కూడా ఎంతో కదిలించింది.
అభిమానుల అండతో, రోహిత్ శర్మ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు కష్టపడుతుండగా, ఈ లేఖ అతనికి అదనపు ప్రేరణను ఇచ్చే అవకాశం ఉంది. రోహిత్, తన ప్రత్యేకమైన శైలిలో మళ్లీ ఫామ్‌లోకి రావడం క్రికెట్ ప్రపంచం కోసం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.