ప్రస్తుతం తండేల్ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ మూవీకి అన్ని వర్గాల అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య కెమిస్ట్రీ, యాక్టింగ్ అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సాయిపల్లవికి దక్షిణాదిలో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. తాజాగీ ఈ బ్యూటీ కోలీవుడ్ క్రేజీ హీరోతో జోడి కట్టనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? ఇంకెవరు కోలీవుడ్ స్టార్ హీరో శింబు.
బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శింబు.. హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శింబు.. 2024లో ఏ సినిమాలు విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘థక్ లైఫ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష ప్రధాన పాత్రలో నటించనుందని టాక్. ఆ సినిమా తర్వాత దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించే సినిమాలో ఆయన నటించనున్నట్లు టాక్ నడుస్తుంది. అలాగే రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన STR 49 కి అతను కమిట్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు బాగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం హీరోయిన్ కోసం టీం వెతుకుతోంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో శింబు జోడిగా సాయి పల్లవి నటించనుందని టాక్ నడుస్తుంది. ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. దీంతో వీరిద్దరి జోడిని స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
Happy to denote my adjacent task with the 1 & lone @SilambarasanTR_ sir 🔥Collaborating with @DawnPicturesOff for this breathtaking venture✨Happy day STR ❤️#str49 #HBDSilambarasanTR @AakashBaskaran pic.twitter.com/frtFrwKc8v
— Ramkumar Balakrishnan (@ImRamkumar_B) February 2, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన