రెహమాన్ భార్య సైరా భాను స్పందించారు. రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనవద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆ మేరకు సైరా భాను న్యాయవాది వందనా షా ఓ వాయిస్ క్లిప్ ను విడుదల చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. తాను సైరా భానును మాట్లాడుతున్నానని.. ప్రస్తుతం ముంబైలో ఉన్నానని చెప్పారు. గత కొన్నినెలలుగా శారీరకంగా తన పరిస్థితేమీ బాగాలేదన్నారు. అందుకే రెహమాన్ నుంచి విడాకులు కోరుకున్నానని అన్నారు. ఇదే తన విడాకులకు కారణమని చెప్పారు. యూట్యూబ్ కు, యావత్ యూట్యూబర్లకు, తమిళ మీడియాకు విజ్ఞప్తి చేశారు. రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దన్నారు. తన అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని. తాను ఎక్కడున్నానో తనకు తెలుసని చెప్పారు. కానీ మీరే సైరా ఎక్కడుందంటూ వెదుకుతున్నారన్నారు. తాను చికిత్స తీసుకునేందుకు ముంబయి వచ్చానని.. తన పిల్లలను కానీ, రెహమాన్ ను కానీ ఎవరినీ తాను డిస్టర్బ్ చేయదలుచుకోలేదన్నారు. రెహమాన్ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడ్ని అలా వదిలేయండని కోరారు. తాను అతడ్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. అతను కూడా తనను అలాగే ప్రేమించారన్నారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయకండని కోరారు. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకుని చెన్నై వస్తానని సైరా బాను తన వాయిస్ నోట్ లో వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.