ఇవి కూడా చదవండి
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తాజాగా ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించారు.ఆయనతో పాటు విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్ లో తళుక్కుమన్నారు. అయితే నలుపు రెండు డ్రెస్సులో అందరికన్నా స్టైల్ గా కనిపించాడు షారుఖ్. అలాగే చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించాడీ స్టార్ హీరో. అయితే షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలైపోయాయి. ఇంకే ముంది షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్ ఏ బ్రాండ్ అని చాలామంది నెట్టింట సెర్చ్ చేయడం ప్రారంభించారు. అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. షారుఖ్ ఖాన్ పెట్టుకున్న వాచ్ అడెమర్స్ పిగట్ బ్రాండ్ వాచ్. ఇది సుమారు 18 క్యారెట్ స్యాండ్ గోల్డ్ తో తయారవుతుందట. పైగా ఇది లిమిటెడ్ ఎడిషన్. ఈ మోడల్ వాచ్ లు ప్రపంచం మొత్తం మీద కేవలం 250 మాత్రమే ఉన్నాయట. ఒక్కో వాచ్ ఖరీదు అక్షరాలా రూ. 76 లక్షల పైనే. దీంతో ఈ వాచ్ ఖరీదు తెలిసి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో బాలీవుడ్ బాద్ షా అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనంటున్నారు. మొత్తానికి షారుఖ్ వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షారుఖ్ దగ్గర ఇవి కూడా
షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా మరికొన్ని బ్రాండెడ్ అంగ్ కాస్ట్లీ వాచెస్ ఉన్నాయి. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్‌బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్ క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు షారుఖ్ దగ్గర ఉన్నాయి.
ఐఫా ఈవెంట్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, నోరా ఫతేహి..
స్టార్ హీరోల రాకతో సందడి సందడిగా ఐఫా ఈవెంట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.