ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, అతనిని IPL 2025 మెగా వేలానికి ముందు రిటెన్ చేసుకోకుండా ఫ్రాంచైజీ అతన్ని విడిచిపెట్టింది. బదులుగా, KKR రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్‌లను నిలుపుకుంది.
అయితే, పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అతను ఇప్పుడు పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల శ్రేయాస్, KKR తనను నిలుపుకోనందుకు గురైన నిరాశ గురించి, ఆ నిర్ణయంపై తన భావాలు వివరించాడు.
శ్రేయాస్ అయ్యర్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకమైంది. “KKRలో ఛాంపియన్‌షిప్ గెలవడం నా జీవితంలోని అత్యంత మధురమైన అనుభవాల్లో ఒకటి. అభిమానుల ప్రేమ, వారి ప్రోత్సాహం అసాధారణం. స్టేడియంలో వారు సృష్టించిన వాతావరణం అద్భుతంగా ఉండేది. ఆ జట్టుతో గడిపిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయంగా ఉంటుంది,” అని శ్రేయాస్ భావోద్వేగంగా చెప్పాడు. అతని కెప్టెన్సీలో KKR 2024లో IPL ట్రోఫీని సాధించింది. ఈ విజయంతో తనపై ఎంతో గర్వంగా అనిపించిందని, ఆ జట్టుతో ఉన్న అనుబంధం తనకు ఎప్పటికీ మరిచిపోలేనిదని శ్రేయస్ హైలైట్ చేశాడు. ఆ టైటిల్ గెలవడం నా జీవితంలో ఒక గొప్ప మైలురాయి, అని శ్రేయాస్ భావోద్వేగంగా చెప్పాడు.
అయితే, ఫ్రాంచైజీ తనను నిలుపుకోకపోవడం అతనికి నిరాశ కలిగించింది. రిటెన్షన్ విషయంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం బాధించిందని, రిటెన్షన్ తేదీకి కొద్ది రోజుల ముందు విషయం తెలిసినప్పుడు ఆ పరిస్థితి తనకు అసహజంగా అనిపించిందని చెప్పాడు.
2024 ఛాంపియన్‌షిప్ గెలుపు తర్వాత కూడా, రిటెన్షన్ గురించి సరైన కమ్యూనికేషన్ జరగలేదు అని, కొన్ని నెలల పాటు ఎటువంటి చర్చలు లేకపోవడం తన మనసులో సందేహాలను రేకెత్తించింది అని అయ్యర్ తెలిపాడు. రిటెన్షన్ తేదీకి కేవలం వారం ముందే ఆ నిర్ణయం గురించి తెలిసినప్పుడు, నిరాశ తప్పదని అనిపించింది, అని శ్రేయాస్ అన్నారు.
శ్రేయస్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, KKRతో గడిపిన సమయం తనకు ఎప్పటికీ ప్రత్యేకమై ఉంటుందని పునరుద్ఘాటించాడు. శ్రేయస్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఒకప్పుడు కెప్టెన్‌గా ఉండగా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. అతని కెప్టెన్సీ పంజాబ్ జట్టుకు కొత్త శక్తిని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి శ్రేయస్ సారథ్యంలో ప్రీతీ జట్టు తొలి టైటిల్ అందుకోనుందా అనే ప్రశ్న అందరిలో పుట్టుకొచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..