బిగ్బాస్ తెలుగు సీజన్ 8 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో నటించినా సోనియాకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే ఆమె పేరు మార్మోగిపోయింది. ఇక హౌస్ లోనూ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందిని హర్ట్ చేసింది. ఇదే క్రమంలో ఆమె ఆట తీరు కూడా మారిపోయింది. ఫలితంగా చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా ఆకుల నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది. పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిందీ ముద్దుగుమ్మ. ఇలా ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తోన్నసోనియా ఆకుల తన ఫ్యాన్స్ కు ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ యష్ తో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుంది. శుక్రవారం (నవంబర్ 21) కేవలం ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో సోనియా- యష్ ల నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోనియా ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనియా-యష్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది సోనియా. యష్ తో తనకు మూడేళ్ల పరిచయం ఉందని, బిగ్ బాస్ కి వెళ్లేముందే వివాహం చేసుకోవాలనుకున్నామంది. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని స్వయంగా యష్ నే తనను రియాలిటీ షోకి పంపాడని కూడా చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
కాబోయే భర్తతో సోనియా..
కాగా యష్ కు ఇప్పటికే పెళ్లయిందని, అయితే భార్యతో విడాకులు తీసుకున్నాడని తెలుస్తోంది. డిసెంబర్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.
యష్ తో బిగ్ బాస్ బ్యూటీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి