హైదారబాద్, ఫిబ్రవరి 4: కేంద్ర సాయుధ బలగాల్లో ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) నియామక పరీక్ష 2024లు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 వరకు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన కేంద్రాల్లో పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. తాజా ఫలితాల్లో మొత్తం 24,190 అభ్యర్థులు పేపర్ 2 పరీక్షకి అర్హత సాధించినట్లు కమిషన్ వెల్లడించింది.
దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించని వారికి పేపర్ 2 పరీక్షను మార్చి8వ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. దీంతో కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లైంది. ఇప్పటికే సీబీటీ రాత పరీక్ష(పేపర్ 1) పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)లు పూర్తికాగా.. పేపర్ 2 పరీక్ష అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక పూర్తవుతుంది. ఎంపికైన సబ్-ఇన్‌స్పెక్టర్ అభ్యర్ధులు ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది.
కాగా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో మొత్తం 4,187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఎస్సెస్సీ ఎస్సై, CAPF కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.