Sudheep- PM Modi: ‘మీ మాటలు ధైర్యాన్ని నింపాయి మోదీజీ’.. ప్రధాని లేఖపై స్పందించిన హీరో సుదీప్

2 hours ago 1

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో ఇటీవల ఒక విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి సరోజా సంజీవ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా తన తల్లిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు సుదీప్. ఈ నేపథ్యంలో అతనికి ధైర్యం చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓ లేఖను పంపించారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీప్ ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ తల్లి సరోజా సంజీవ్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె లోటు పూడ్చలేనిది. అమ్మ గొప్ప మనసును వర్ణించలేం. నువ్వు భావోద్వేగానికి గురైన క్షణాలు చూస్తుంటే ఆమెతో నీకున్న అనుబంధం.. నీపై ఆమె ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది. జ్ఞాపకాల రూపంలో ఆమె ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆమె నేర్పించిన విలువలు నీలో స్ఫూర్తి నింపుతూనే ఉండాలి. జీవితంలో ఇదొక క్లిష్ట సమయం. దీనిని అధిగమించే ధైర్యాన్ని ఆ భగవంతుడు నీకు, కుటుంబసభ్యులకు అందించాలని ప్రార్థిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సుదీప్ ‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. మీ సంతాప లేఖకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మీ ఆలోచనాత్మకమైన మాటలు నా మనసును తాకాయి. నాకెంతో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చాయి. మీరు చూపించిన ఈ ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుంది’ అని రిప్లై ఇచ్చారు కిచ్చా సుదీప్.

ఇవి కూడా చదవండి

సుదీప్ కు  ప్రధాని రాసిన లేఖ..

Honarable @PMOIndia @narendramodi ji, I americium penning to sincerely convey you for this compassionate condolence letter. Your thoughtful words supply a root of comfortableness during this profoundly hard time. Your empathy has touched my bosom deeply, and I americium genuinely grateful for your… pic.twitter.com/u4aeRF8Sw3

— Kichcha Sudeepa (@KicchaSudeep) October 28, 2024

. తన తల్లి మరణం తరువాత, కిచ్చా సుదీప్ సినిమా, బిగ్ బాస్ షూటింగుల నుండి విరామం తీసుకున్నాడు. గత వారాంతంలో బిగ్ బాస్ ఎపిసోడ్‌కి సుదీప్ హోస్ట్ చేయలేదు. సరోజా సంజీవ్ మరణ వార్తను బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు కూడా తెలియజేశారు. విషయం తెలియగానే అందరూ కంటతడి పెట్టారు.

కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్..

My parent , the astir unbiased, loving, forgiving, caring, and giving, successful my beingness was valued , celebrated, and volition ever beryllium cherished. *Valued… due to the fact that she was my existent deity adjacent to maine successful the signifier of a human. *Celeberated… due to the fact that she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944

— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article