Suma Kanakala: స్టార్ యాంకర్ సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో

2 hours ago 1

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల అంటే తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. చిన్న సినిమాల మొదలు స్టార్ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా ఈ వెంట్లు చేస్తోందీ యాంకరమ్మ. ఇక టీవీషోస్‌లోనూ సందడి చేస్తుంటుంది. ఇక మాల్స్ ఓపెనింగులు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ స్టార్ హీరో, హీరోయిన్లతో సమానంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది సుమ. అయితే సుమ మాటలు, యాంకరింగ్ గురించి తప్పితే ఆమె గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు. తాను సంపాదించిన డబ్బుతో ఎంతో మందికి సాయం చేస్తోందీ స్టార్ యాంకరమ్మ. ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సుమ. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. తన వంతుగా విరాళాలు అందజేస్తుంది. అలా ‘ఫెస్టివల్ ఫర్ జాయ్’ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 30కి పైగా విద్యార్థులకు, 30కి పైగా సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సహాయం అందిచిందట. అలాగే 200 పైగా కంటి చికిత్సలను కూడా చేయించిందట. అంతేకాకుండా ఎన్నో అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సహాయం అందించిందట’. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంద సుమ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సుమ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిరుపేదలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి.. ప్రతి పండగను ఆనందంగా మార్చాలనే లక్ష్యంతో ఈ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే ఫౌండేషన్ ను ప్రారంభించారట. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతను నటించిన బబుల్‌ గమ్ సినిమా గతేడాది విడుదలైంది. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న రోషన్ ఆ మధ్యన మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లోనూ ఒక కీలక పాత్రలో కనిపించాడు.

సుమ షేర్ చేసిన పోస్ట్ ఇదిగో..

I consciousness highly overwhelmed and blessed to spot the travel of Festivals for joy, How we started and wherever we are today, my sincere gratitude to each the Donors and Team FFJ. It was started with a elemental motto of celebrating each festival with a intent to service humanity, to bring… pic.twitter.com/JhTfKaO0aG

— Suma Kanakala (@ItsSumaKanakala) November 22, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article