ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గొప్ప నటి మాత్రమే కాదు.. గొప్ప తల్లి సైతం. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సుస్మితాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 48 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగానే ఉంటుంది. కానీ పెళ్లి కాకుండానే 28 ఏళ్ల వయసులోనే తల్లి అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. మొదటి కుమార్తె రెనీని 2000లో.. ఆమె రెండవ కుమార్తె అలీసాను 2010లో దత్తత తీసుకుంది. ఇప్పుడు తన కూతుర్లతో కలిసి సంతోషంగా ఉంటుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత తన సంపాదన గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మొదటి కుమార్తెను దత్తత తీసుకున్నప్పుడు తన వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే అని.. దీంతో అప్పట్లో సుస్మిత తల్లి ఆమెపై అసంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చింది. కానీ తండ్రి మాత్రం సుస్మితకు పూర్తి మద్దతుగా నిలిచారట. తన తండ్రి వల్లే ఆడపిల్లలను దత్తత తీసుకున్నానని… మా నాన్న సపోర్టు వల్లే కోర్టు నాకు కూతురిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.
‘భారత వ్యవస్థ చాలా నిర్దిష్టమైనది. తండ్రి లేకుంటే తండ్రి నీడ లేదు, నాన్న తప్ప మరొకరు సరిపోరు. కోర్టు తీర్పు ప్రకారం తండ్రి ఆస్తిలో సగం పిల్లలకు ఇవ్వాలి. మా నాన్న అన్నీ నా కూతురి పేరు మీదనే రాశాడు. అందుకే మా నాన్నగారిని చూసి గర్వపడుతున్నాను…’ అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇక రెండవ కూతురుని దత్తత తీసుకోవడానికి దాదాపు 10 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగింది. భారతీయ చట్టాల ప్రకారం, ఒక కుమార్తెను దత్తత తీసుకుంటే, మరొక కుమార్తెను దత్తత తీసుకోలేరు. దీంతో తన తండ్రి సహాయంతో దాదాపు 10 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసింది.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.