Team India: టెస్ట్ మ్యాచ్ 4వ ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ ఛేజింగ్‌లు ఇవే.. లిస్ట్‌లో ఎన్నడూ మరిచిపోలేని రిజల్ట్

2 hours ago 1

India Highest Run Chase successful Test: టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఆడడం ఎప్పుడూ కష్టమే. ఫ్లాట్ పిచ్‌తో పాటు, అది పేస్, బౌన్సీ పిచ్ లేదా స్పిన్ ట్రాక్ వికెట్ అయినా, మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్స్‌కు మనుగడ సాధించడం అంత సులభం కాదు. కానీ ఇప్పటికీ, టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని భారీ ఛేజింగ్‌లు కనిపించాయి. రెడ్ బాల్ ఫార్మాట్‌లో టీమిండియా కొన్ని భారీ పరుగులను కూడా ఛేదించింది. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు భారత క్రికెట్ జట్టుకు అంతగా ప్రత్యేకం కానప్పటికీ, టీం ఇండియా ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచి భారీ స్కోర్‌లను ఛేదించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం పూణె టెస్ట్‌లోనూ ఇలాంటి సీన్ రిపీట్ కావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం రెండో టెస్ట్‌లో భారత్ ఓడిపోయి, సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు ఛేజింగ్ చేసిన 3 సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3. 328 పరుగులు vs ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ (2021)..

గబ్బా వేదికగా ఆస్ట్రేలియా అహంకారాన్ని టీమిండియా బద్దలు కొట్టిన ఆ క్షణాన్ని బహుశా ఎవరూ మర్చిపోలేరు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు కంగారూ జట్టును ఓడించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. భారత జట్టు విజయానికి హీరోగా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. దీంతో భారత్ 336 పరుగులు చేసింది. కంగారూ జట్టు మూడో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసి భారత్‌కు 328 పరుగుల లక్ష్యాన్ని అందించింది, శుభ్‌మన్ గిల్ 91 పరుగులు, రిషబ్ పంత్ 89* పరుగులతో 7 వికెట్లకు 329 పరుగులు పూర్తి చేసి టీమ్ ఇండియా మ్యాచ్ గెలిచింది.

2. 387 పరుగులు vs ఇంగ్లాండ్, చెన్నై (2008)..

భారత క్రికెట్ జట్టు 2008లో ఇంగ్లండ్‌పై 387 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించి కొత్త చరిత్ర లిఖించింది. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులు చేయగా, దానికి సమాధానంగా భారత్ 241 పరుగులకే పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 311 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లిష్ జట్టు భారత్‌కు 387 పరుగుల లక్ష్యాన్ని అందించింది. వీరేంద్ర సెహ్వాగ్ 68 బంతుల్లో 82 పరుగులు, సచిన్ టెండూల్కర్ అద్భుత 103 పరుగులతో టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

1. 403 పరుగులు vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (1976)..

టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో 1976లో వెస్టిండీస్‌పై స్వదేశంలో జరిగిన అతిపెద్ద పరుగుల వేటగా ఇది నిలిచింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ భారత్‌కు 403 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. దీన్ని సాధించగలమని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ గుండప్ప విశ్వనాథ్ 112 పరుగులు, సునీల్ గవాస్కర్ 102 పరుగుల సహాయంతో భారత జట్టు ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 359 పరుగులకు ఆలౌటైంది, దీనికి సమాధానంగా టీమిండియా 228 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కరీబియన్‌ జట్టు 6 వికెట్లకు 271 పరుగుల స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article