ముఖం చంద్రబింబంలా ప్రకాశించాలంటే దంత సిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సరైన పలువరుస మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖరీదైన వైద్యం చేయించుకోనక్కర్లేదు. బదులుగా సింపుల్‌గా ఇంట్లో దొరికే పండ్లు తిన్నా సరిపోతుందని అంటున్నారు నిపుణులు..
Updated on: Feb 12, 2025 | 6:49 PM
నోట్లోని పళ్లు మన శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి ఆహారం మనస్సును రంజింప చేస్తుంది. నోటికి రుచిని ఇవ్వడం ద్వారా మనల్ని ఆనందపరుస్తుంది. మీ దినచర్యలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు నోటి ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.
1 / 5
ముఖ్యంగా మంచి దంత సంపదకు రోజుకు ఒక యాపిల్ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే యాపిల్‌ను సహజ టూత్ బ్రష్ అని అంటారు. ఎందుకంటే ఇది టూత్ బ్రష్ లాగానే ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దంతక్షయం కలిగించే బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు కూడా దంత ఆరోగ్యానికి మంచివి.
2 / 5
అరటిపండ్లు పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, దంతాలకు మేలు చేస్తాయి. భోజనం తర్వాత ఇంట్లో తయారుచేసిన పుదీనా గ్రీన్ టీ తాగడం వల్ల నోటి పరిశుభ్రత, తాజా శ్వాస, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
3 / 5
చిలగడదుంపలలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పంటి ఎనామిల్‌ను రక్షిస్తుంది. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర, విటమిన్లు A, B2, B12 లతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చిగుళ్ళు, దంతాలకు దోహదం చేస్తాయి. ఈ ఆహారాలతో పాటు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని శీతాకాల సంరక్షణ చిట్కాలను పాటించడం చాలా అవసరం.
4 / 5
మీ దంతాలకు చల్లని గాలి తగలకుండా చూసుకోవాలి. తీవ్రమైన చలిలో బయటకు వెళ్ళేటప్పుడు, మీ దంతాలను రక్షించడానికి, వెచ్చదనం, తేమను అందించడానికి,మీ నోరు ఎండిపోకుండా నిరోధించడానికి మౌత్ గార్డ్ ధరించడం మంచిది. ఇది లాలాజలాన్ని తగ్గిస్తుంది. దంతక్షయం ప్రమాదాన్ని పెంచుతుంది.
5 / 5